Share News

నెరవేరిన ముస్లింల కల

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:06 AM

ముస్లింల కోసం పట్టణంలో నిర్మిస్తున్న షాదీఖానా నిర్మాణం పూర్తయింది. నేడు ఈ షాదీఖాను భవనాన్ని మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్‌ఎండి ఫరూక్‌ ప్రారంభించనున్నారు.

నెరవేరిన ముస్లింల కల
బనగానపల్లెలో పూర్తయిన షాదీఖానా భవన ముఖద్వారం

ప్రభుత్వం రూ.కోటి, బీసీ సొంత నిధులు రూ.1.6కోట్లతో నిర్మాణం

నేడు బనగానపల్లెలో షాదీఖానా ప్రారంభం

బనగానపల్లె, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ముస్లింల కోసం పట్టణంలో నిర్మిస్తున్న షాదీఖానా నిర్మాణం పూర్తయింది. నేడు ఈ షాదీఖాను భవనాన్ని మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్‌ఎండి ఫరూక్‌ ప్రారంభించనున్నారు.

వైసీపీ హయాంలో ఆగిన నిర్మాణం

2019లో షాదీఖానా నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, మంత్రి ఫరూక్‌ రూ.కోటితో పనులను ప్రారంభహహించారు. అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో రాజకీయ కక్ష్యతో పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. భవానాన్ని ఎలాగైనా పూర్తిచేయాలని బీసీ యత్నించినా ఆయనపై వైసీపీ నాయకులు కేసులు పెట్టడంతో పనులు ముందుకు సాగలేదు. అయితే 2024లో టీడీపీ అధికారంలోకి రావడతో షాదీఖానా భవన నిర్మాణం పనులు మంత్రి బీసీ నేతృత్వంలో తిరిగి వేగవంతయ్యాయి.

మంత్రి బీసీ సొంత నిధులు రూ.1.6 కోట్లు

షాదీఖాని భవనం నిర్మాణం ఆగిపోవడంతో ఎలాగైనా పూర్తిచేయాలని మంత్రి బీసీ తన సొంత నిధులు రూ.1.6కోట్లను కేటాయించారు. దీనికి ప్రభుత్వ నిధులు రూ.కోటి మొత్తం రూ.2.6కోట్లతో భవనం పూర్తయింది. అత్యాధునిక సౌకర్యాలతో సామాజిక, కుటుంబ వివాహ వేడుకలు, ఇతర వేడుకల నిర్వహణకు ముస్లింలకు ఉపయోగపడనుంది.

మాట నిలబెట్టుకున్న మంత్రి

పట్టణంలో షాదీఖానా నిర్మాణాన్ని పూర్తిచేయిస్తానని బీసీ జనార్దన్‌రెడ్డి 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా ప్రమాణ స్వీకరాం చేయడంతో షాదీఖా భవన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఏళ్ల తరబడి పనులు ఆగిపోవడంతో ముళ్ల కంపలతో నిండి భవనం పనికి రాకుండా పోయింది. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పట్టుదల, జోక్యంతో పనులు పూర్తయ్యాయి. షాదీఖానా పూర్తికావడంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నెరవేరిన ముస్లింల కల

వివాహాలు, శుభ కార్యాల నిర్వహణకు ఆర్థికస్తోమత లేని ముస్లింలు షాదీఖానా నిర్మించాలని కోరారు. అయితే ఏళ్లతరబడి భవనం పూర్తికాకపోవడంతో నిరాశ చెందారు. ఎట్టకేలకు భవనం పూర్తికావడంతో తమ కల నెరవేరిందని ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవనం పూర్తికావడంతో మంత్రులు బీసీ, ఫరూక్‌ ఆదివారం షాదీఖాను ప్రారంభించనున్నారు. భవనం ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Updated Date - Sep 20 , 2026 | 12:06 AM