లింగ నిర్ధారణ పరీక్షలు నేరం
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:24 AM
లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్దమని, ఎవరైనా అలాంటి పనులకు పాల్పడితే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు డీఎంహెచ్‌వో డా.వై. కామేశ్వర ప్రసాద్ హెచ్చరించారు.
డీఎంహెచ్‌వో డాక్టర్ కామేశ్వర ప్రసాద్
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్దమని, ఎవరైనా అలాంటి పనులకు పాల్పడితే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు డీఎంహెచ్‌వో డా.వై. కామేశ్వర ప్రసాద్ హెచ్చరించారు. ఆదివారం నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కర్నూలు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఐఎంఏ భవన్‌లో ఆర్‌జే శ్రీనివాసన్ స్మారక ఉపన్యాసం కార్యక్రమానికి డీఎంహెచ్‌వో డా.వై. కామేశ్వర్ ప్రసాద్, కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే. వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించవద్దని గైనకాలజిస్టులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కర్నూలు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు డా. రామచంద్ర నాయుడు, డా.ఎస్‌వీ రామమోహన్ రెడ్డి, ఆప్నా అధ్యక్షుడు డా.వేణుగోపాల్ పాల్గొన్నారు.