సద్గురు దత్త కృపాలయం సేవలు అభినందనీయం: మంత్రి
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:01 AM
నగరంలోని సద్గురు దత్త కృపాలయం అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
కర్నూలు కల్చరల్, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): నగరంలోని సద్గురు దత్త కృపాలయం అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం పాత నగరంలోని జమ్మిచెట్టు సమీపంలో ఉన్న సద్గురు దత్త కృషాల యంలో మంత్రి మూడు వైకుంఠ రథాలు, నాలుగు ఫ్రీజర్ బాక్సు లను ప్రారంభించి మాట్లాడారు. కరోనా సమయంలో సద్గురు దత్త కృపాలయం ప్రతినిధులు ఎంతో శ్రమించారన్నారు. కర్నూలు జీజీహె చకు వచ్చే వారికి ప్రతిరోజూ సుమారు వెయ్యి మందికి ఉచితంగా భోజనం అందించారన్నారు. డీవీఆర్ కమ్యూని కేషన్స్ అధినేత డి. వెంకటేశ్వరరెడ్డి, సద్గురు దత్త కృపాలయానికి రూ.లక్ష విరాళం అం దించారు. ఈ చెక్కును ఆ సంస్థ జీఎం ఎస్‌కే మహేష్ సద్గురు దత్త కృపాలయం కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో సద్గురు దత్త కృపాలయం వ్యవస్థాపకుడు చంద్రశేఖర్‌రెడ్డి, మాతృశ్రీ కృష్ణకు మారి, అధ్యక్షుడు మల్లారెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ జగదీష్‌గుప్త, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య, కృపాలయం కార్యదర్శి శ్రీధర్‌గుప్త, అడిషనల్ సెక్రటరీ హరినాథ్‌రెడ్డి, రాకేశ్, నిర్మలారెడ్డి, శేషుయాదవ్, సుజాత పాల్గొన్నారు.