స్వయం ఉపాధితో ఆత్మ గౌరవం
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:34 AM
స్వయం ఉపాధి మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుందని ఆర్‌సీఎం డయోసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేస్ పిలుపునిచ్చారు.
ఆర్‌సీఎం డయోసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేస్
కర్నూలు కల్చరల్, జూన 12(ఆంధ్రజ్యోతి): స్వయం ఉపాధి మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుందని ఆర్‌సీఎం డయోసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేస్ పిలుపునిచ్చారు. శుక్రవారం బిషప్ చర్చి సమావేశ హాలులో కేడీఎస్‌ఎస్‌ఎస్ (కర్నూలు డయోసిస్ సాంఘిక సేవా సంస్థ) ఆధ్వర్యంలో 120 మంది మహిళలకు కుట్లు, అల్లికలు స్వయం ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా శిక్షణ అనంతరం కుట్టు మిష న్లు పంపిణీ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి విచ్చేసిన గ్రామీణ పేద మహిళలకు వీటిని అందజేశారు. గోరంట్ల జ్వాన్నేస్ మా ట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పేదరికాన్ని జయించాలని కోరారు. కుట్లు, అలికల్లో శిక్షణ ఇచ్చిన ట్రైనర్ల (గురువు)లను అభినందించారు. కార్యక్రమంలో కేడీఎస్ ఎస్‌ఎస్ డైరెక్టర్ ఫాదర్ తోట జోసెఫ్, ఇతర ఫాదర్లు చిన్నప్పరెడ్డి, భాస్కర్, లహసా్త్రయ, బాలరాజు, బాలస్వామి, సిస్టర్లు, కేడీఎస్‌ఎస్‌ఎస్ సిబ్బంది, ట్రైనర్లు పాల్గొన్నారు.