Share News

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపిక

ABN , Publish Date - Oct 28 , 2026 | 12:13 AM

రాయలసీమ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం(ఎన్‌ఎ్‌సఎ్‌స) వలంటీర్లు వెస్ట్‌ జోన్‌ ఫ్రీ రిపబ్లిక్‌ డే పరేడ్‌ క్యాంపునకు ఎంపిక కావడం పట్ల వి. వెంకట బసవరావు హర్షం వ్యక్తం చేశారు.

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపిక
ఎంపికైన విద్యార్థులతో వీసీ, రిజిస్ట్రార్‌

కర్నూలు అర్బన్‌ , అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం(ఎన్‌ఎ్‌సఎ్‌స) వలంటీర్లు వెస్ట్‌ జోన్‌ ఫ్రీ రిపబ్లిక్‌ డే పరేడ్‌ క్యాంపునకు ఎంపిక కావడం పట్ల వి. వెంకట బసవరావు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం తన చాంబర్లో విద్యార్థులను రిజిస్ట్రార్‌ బి. విజయకుమార్‌ నాయుడుతో కలిసి వీసీ వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎ్‌సఈ విభాగ విద్యార్థి బి. ప్రవీణ్‌, ఈసీఈ విద్యార్ధినీ కే. మహేశ్వరి ఎంపిక కావడం వర్శిటీకి గర్వకారణమని కొనియాడారు. నవంబరు 9 నుంచి 19 వరకు హైదరాబాదులోని అనురాగ్‌ యూనివర్సిటీలో ఈ శిబిరం నిర్వహించనున్నారు. సెప్టెంబరు19న రాయలసీమ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ఎంపికలో 156 మంది పాల్గొనగా, వారిలో ఇద్దరు అర్హత సాధించినట్లు కోఆర్డినేటర్‌ డా. బి. కవిత తెలిపారు. ఆలాగే ఒడిస్సాలోని సంబల్‌ పూర్‌లో ఆనెల 10 నుంచి 16 వరకు నిర్వహించిన వందే మాతం కార్యక్రమానికి ఎంపికైన ఎంఏ ఇంగ్లీష్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి రవి, సుంకేసుల రోడ్డులోని సెయింట్‌ జోసెఫ్స్‌ డిగ్రీ కళాశాల బీసీఏ 3వ సంవత్సరం విద్యార్థి రత్నరాజును వీసీ అభినందించారు.

Updated Date - Oct 28 , 2026 | 12:13 AM