ఆధారాలు లేని డబ్బు స్వాధీనం
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:22 PM
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో లెక్కలు లేని 30 లక్షల నగదు పట్టుబడింది.
శ్రీశైలం టోల్ గేట్ వద్ద మహారాష్ట్రకు చెందిన కారులో రూ.30 లక్షలు
పోలీస్ స్టేషన్‌కు అప్పగించిన సీఎస్‌వో శ్రీనివాసరావు
శ్రీశైలం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో లెక్కలు లేని 30 లక్షల నగదు పట్టుబడింది. సోమవారం మధ్యాహ్నం టోల్‌గేట్ వద్ద ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెక్యూరిటీ సిబ్బంది, హోంగార్డులు క్షేత్రంలోనికి ప్రవేశిస్తున్న వాహనా లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా మహా రాష్ట్రకు చెందిన ఎంహెచ్ 11డిఎం 0589 నంబరు గల కియా కారులో రూ. 30 లక్షల నగదు ఉన్న బ్యాగు పట్టుబడింది. క్షేత్రంతో సంబంఽ దంలేని వ్యక్తులు ఈ నగదుకు సంబంఽ దించిన పత్రాలు చూపలేకపోవడం, బంగారు వ్యాపా రం చేసే వాళ్లమని, మహారాష్ట్ర వాసులమని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో సీఎస్‌వో శ్రీనివాసరావు శ్రీశైలం 1వ పట్టణ పోలీసులకు సమాచారం అందిం చారు. విచారణ నిమమిత్తం స్వాధీనపరుచుకుని వివరాలు సేకరిస్తున్నట్లు సీఐ జీవన్ గంగనాథబాబు చెప్పారు. నగదును ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు డీఎస్‌పీ రామాంజినాయక్ చెప్పారు.