శబ్దాలు చేస్తే వాహనాలు సీజ్ చేస్తాం
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:48 AM
ద్విచక్రవాహనాల సైలెన్సర్లతో, ఆటో హారన్లతో అధిక శబ్దాలు చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్
100 బైక్ సైలెన్సర్లు, 50 ఆటో హారన్లు రోలర్‌తో ధ్వంసం
కర్నూలు క్రైం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ద్విచక్రవాహనాల సైలెన్సర్లతో, ఆటో హారన్లతో అధిక శబ్దాలు చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలో కొండారెడ్డి బురుజు వద్ద అధిక శబ్ధం కలిగించే 100 సైలెన్సర్లను, 500 ఆటో హారన్‌లను ఎస్పీఆధ్వర్యంలో రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఆయన మాట్లాడుతూ నగరంలో కొంత మంది యువకులు ద్విచక్రవాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చారన్నారు. నెలరోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 100 బైక్ సైలెన్సర్లను, 500 ఆటో హారన్‌లను సీజ్ చేశామన్నారు. ఎవరైనా రాత్రివేళలో అధిక శబ్దం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిజిటల్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డును, 66 సోలార్‌రెడ్ బ్లికింగ్ స్టడ్స్‌ను, 4 అధునాతన మూవబుల్ బారికేడ్స్‌ను కర్నూలు ట్రాఫిక్ పోలీసులకు దాతలు అందజేశారన్నారు. దాతలైన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం, గోల్డ్ షాప్ ప్రబాకర్, డీఈ ఫణికుమార్‌ను ఎస్పీ జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అడిషనల్ ఎస్పీలు హుశేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీ బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్‌రావు, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, పోలీసులు ఉన్నారు.