Share News

రెండో విడత ప్రశాంతం

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:08 PM

జిల్లాలో రెండో విడత నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది.

రెండో విడత ప్రశాంతం

186 పంచాయతీల్లో ముగిసిన నామినేషన్ల ఘట్టం

సర్పంచ్‌ స్థానాలకు 1,169, వార్డులకు 4,305 నామినేసన్లు

కర్నూలు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఆదోని రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఎమ్మిగనూరు, మంత్రాలయం, కర్నూలు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పాణ్యం నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీలకు రెండో విడత కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. 186 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలు, 1972 వార్డులకు నామినేషన్లను స్వీకరించారు. 74 క్లస్టర్ల పరిధిలో ఆర్వోలు స్వీకరణ చేపట్టారు. తొలి బోణి అదిరింది. చివరి రోజు పోటాపోటీగా సర్పంచ్‌ పదవి ఆశిస్తున్న ఆశావహుల నామినేషన్‌ పత్రాలను ఆర్వోలకు అందజేశారు. మూడు నియోజకవర్గాల్లోని 9 మండలాల్లో 186 సర్పంచి పీఠాల కోసం 1,669 మంది అభ్యర్థులు, 1972 వార్డులకు 4,342 మంది అభ్యర్థులు పోటీకి సై అన్నారు. శనివారం నామినేషన్లు పరిశీలిస్తారు. ఏ కారణం చేతనైనా నామినేషన్లు తిరస్కరిస్తే ఆర్డీవోలకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది.

మండలాల వారీగా సర్పంచి, వార్డులకు దాఖలైన నామినేషన్లు

మండలం సర్పంచ్‌ వార్డులు

గోనెగండ్ల 151 458

కోసిగి 159 552

కౌతాళం 156 639

మంత్రాలయం 118 437

నందవరం 105 447

పెద్దకడుబూరు 130 473

ఎమ్మిగనూరు 117 437

కల్లూరు 94 313

ఓర్వకల్లు 139 486

మొత్తం 1,169 4,342

Updated Date - Nov 20 , 2026 | 11:08 PM