పంచుకున్నారు
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:09 AM
నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు ఏకగ్రీవయ్యే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. పదవుల పంపకానికి ముఖ్య నాయకులు సమాలోచనలు చేస్తున్నారు. కాగా ఇద్దరు, ముగ్గురు నాయకులు జడ్పీటీసీ, ఎంపీపీ పదవులను ఆశిస్తుండంటంతో కుర్చీ ఎవరి వరిస్తుందన్న ఉత్కంఠ కనిపిస్తోంది.
ఏకగ్రీవం దిశగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?
సీట్లు పంచుకున్న టీడీపీ, వైసీపీ
ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ కూడా లేదు..
నేటితో ముగియనున్న గడువు
కొలిమిగుండ్ల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు ఏకగ్రీవయ్యే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. పదవుల పంపకానికి ముఖ్య నాయకులు సమాలోచనలు చేస్తున్నారు. కాగా ఇద్దరు, ముగ్గురు నాయకులు జడ్పీటీసీ, ఎంపీపీ పదవులను ఆశిస్తుండంటంతో కుర్చీ ఎవరి వరిస్తుందన్న ఉత్కంఠ కనిపిస్తోంది.
టీడీపీకి-67, వైసీపీకి-18
నియోజకవర్గంలో మొత్తం 85 ఎంపీటీసీ స్థానాలు, 5 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 4జడ్పీటీసీ, 4ఎంపీపీ పదవులు జనరల్, 1 జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. కాగా రెండోరోజు కూడా నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఏకగ్రీవం అయ్యే ఊహాగానాలకు బలం చేకూరినట్లు కనిపిస్తోంది. ఈ దిశగా వైసీపీకి 18, మిగతా 67 ఎంపీటీసీ స్థానాలుండగా 5 జడ్పీటీసీ స్థానాలు టీడీపీకి దక్కే అవకాశం ఉంది. ఆ దిశగా ముఖ్య నాయకులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. నామిషన్లు నేడు శుక్రవారం చివరి రోజు కావడం, టీడీపీ అధిష్టానం నేటీకీ అభ్యర్థుల జాబితా ప్రకటించక పోవడంతో ఆశావాహుల్లో గంట గంటకూ ఉత్కంఠత పెరుగుతోంది.
మొదటిసారి బీసీ అనుచరులకు పదవులు
బీసీ జనార్దన్ రెడ్డి 2012లో టీడీపీలో చేరి, 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహిచలేదు. కాగా 2021లో బీసీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించగా టీడీపీ పాల్గొనలేదు. 14ఏళ్ల తర్వాత మొదటిసారి బీసీ అనుచరులకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు గ్రామాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.