సీటు బెల్టుతో ప్రాణాలకు రక్ష
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:06 AM
‘సీటు బెల్టు ప్రాణానికి రక్షణగా ఉంటుంది.. సీటు బెల్టు ధరించండి’ అంటూ ఆర్టీవో అధికారులు సోమవారం వినూత్నంగా అవగాహన కల్పించారు.
ధరించిన వారికి పుష్పగుచ్ఛం.. ధరించని వారికి హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
యమదూతల వేషం ధరించిన కళాకారులతో అవగాహన
డోన్ రూరల్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ‘సీటు బెల్టు ప్రాణానికి రక్షణగా ఉంటుంది.. సీటు బెల్టు ధరించండి’ అంటూ ఆర్టీవో అధికారులు సోమవారం వినూత్నంగా అవగాహన కల్పించారు. యముడు, చిత్రగుప్తుడు, యమదూతల వేషధారణలతో కళాకారులతో డోన్ హైవేపై అవగాహన కల్పించారు. సీటు బెల్టు ధరించి వెళ్తున్న వాహనదారులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. సీటు బెల్టు, హెల్మెట్లు ధరించకుండా వెళ్తున్న వాహనదారులను యముడు, యమదూతల వేషధారణలతో ఉన్న కళాకారులు హెచ్చరిస్తూ అవగాహన కల్పించారు. డోన్ ఆర్టీవో క్రాంతికుమార్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మహోత్సవాల్లో భాగంగా ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా, రూరల్ సీఐ రాకేష్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.