Share News

అభ్యర్థుల కోసం నాయకుల వేట

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:59 AM

: నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక కోసం నాయకులు తలమునకలై ఉన్నారు. ఈ అభ్యర్థిని నిలబెడితే గెలిచే అవకాశముందోనని రాజకీయ సమీకరణలు అంచనా వేస్తున్నారు.

అభ్యర్థుల కోసం నాయకుల వేట
నందవరం ఎంపీడీవో కార్యాలయం

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికకు నాయకుల కసరత్తు..

జోరుమీదున్న టీడీపీ, వైసీపీలో అంతర్గత విబేధాలు..

ఎమ్మిగనూరు/నందవరం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక కోసం నాయకులు తలమునకలై ఉన్నారు. ఈ అభ్యర్థిని నిలబెడితే గెలిచే అవకాశముందోనని రాజకీయ సమీకరణలు అంచనా వేస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజర్గంలో జడ్పీటీసీ స్థానాలు మూడు ఉన్నాయి. నందవరం, ఎమ్మిగనూరు రూరల్‌, గోనెగండ్ల స్థానాలు ఉండగా ఎంపీటీసీ స్థానాలు నందవరం-17, గోనెగండ్ల-21 ఎమ్మిగనూరు-21 స్థానాలు ఉన్నాయి.

టీడీపీ టిక్కెట్‌ కోసం ఆశావహుల యత్నం..

టీడీపీ టెక్కెట్‌ కోసం ఆశావహులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ తరపున పోటీచేస్తే చాలు సుళువుగా గెలిచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని టీడీపీ కార్యకర్తలు దీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ టిక్కెట్‌లను గెలిచే వారికే ఇచ్చేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాటు ఎంపీటీసీలను గెలుపు గుర్రాలకు టికెట్‌ ఇస్తే వారు అన్ని గ్రామాల్లో ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం టీడీపీ నాయకుల్లో కూడా ఉంది. టికేట్‌ ఇచ్చే వరకు నాయకులు ఎదురు చూడాల్సి ఉంది.

వైసీపీలో కుమ్ములాట..

వైసీపీలో అభ్యర్థుల ఎంపికకు నాయకుల మధ్య సఖ్యత కుదరడం లేదని సమాచారం. మాజీ ఎంపీ బుట్టా వర్గానికి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనువడు రాజీవ్‌రెడ్డి వర్గీయుల మద్యవర్ధుల రాజీ కుదరడం లేదని తెలుస్తోంది. నందవరం కన్వీనర్‌ శివారెడ్డిగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కెఆర్‌ హనుమంతరెడ్డి మనవడు హలహర్వి సర్పంచ్‌ రామకోటి రెడ్డి పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. గతంలో తమను ఎంతో అవమానించారని ఇక వద్దని అంంటున్నారు. పైగా గ్రామాల్లో అభ్యర్ధులను కూడా నిలబెట్టమని తేల్చి చెప్పారు. దీంతో పార్టీ సీనియర్‌ నాయకులు కంగు తింటున్నారు. వైసీపీలో ముఖ్య నాయకులు శివారెడ్డిగౌడ్‌కు మండలంలో మాచాపురం, పూలచింత, పెద్దకొత్తిలి గ్రామ పంచాయతీలతో పాటు నాగలదిన్నె, పేట గ్రామాల్లో పట్టు ఉంది. అలాగే రామకోటిరెడ్డి జగ్గాపురం, బాపురం హలహర్వి గ్రామాల్లో పట్టు ఉంది. ఎపీటీసీలు, సర్పంచులుగా గెలవాలంటే వీరు ఆశీస్సులు తప్పని సరి. ఇక వారు దూరంగా ఉండటంతో పార్టీని ఎలా గెలిపించాలని సీనియర్‌ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - Oct 19 , 2026 | 12:59 AM