Share News

నామినేషన్ల పరిశీలన పూర్తి

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:25 AM

స్థానిక ఎంపీటీసీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సతీష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి నాగఅనసూయ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను శనివారం పరిశీలించారు.

నామినేషన్ల పరిశీలన పూర్తి
సి.బెళగల్‌లో నామినేషన ప్రతాలను పరిశీలిస్తున్న ఆర్డీవో సందీప్‌ కుమార్‌

2 నామినేషన్లు తిరస్కరణ

ఓర్వకల్లు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీటీసీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సతీష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి నాగఅనసూయ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను శనివారం పరిశీలించారు. 97 మంది నామినేషన్లును పరిశీలించగా.. 2 నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా, మిగిలిన 95 నామినేషన్లు అర్హత పొందాయని ఎన్నికల అధికారులు తెలిపారు. మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు అధికార, వివిద రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలించారు. అర్హత పొందిన నామినేష న్లను పరిశీలించి 95 నామినేషన్లలో టీడీపీ-39, వైసీపీ- 41, జనసేన-4, సీపీఎం-2, బీఎస్‌పీ, బీజేపీ, సీపీఐ, ఆర్‌ఎస్‌పీ పార్టీల నుంచి ఒక్కొక్కటి చొప్పున స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురు ఉన్నారు. ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వ హించారు. ఎన్నికల పరిశీలనను కర్నూ లు డీఎస్పీ రాఘవేంద్ర పర్యవేక్షించారు. ఈ కార్యక్ర మంలో తహసీల్దార్‌ విద్యాసాగర్‌, డిప్యూటీ ఎంపీడీవో శాంతయ్య, సుధీర్‌ కుమార్‌ పాల్గొన్నారు.

కోడుమూరు: మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఇండిపెండెంట్లు కలిపి పార్టీల నుంచి 114 మంది నామినేషన్లు వేశారు. శనివారం రిటర్నింగ్‌ అధికారి జయంతి ఆధ్వర్యంలో నామినేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నామినేషన్లు వేసిన ప్రతి అభ్యర్థి నామినేషన్లలో ఎలాంటి పొరపాట్లు లేకపోవడంతో అన్ని ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌వో ఏసీ రాముడు పాల్గొన్నారు.

గూడూరు: మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి పరి శీలన కార్యక్రమంలో మొత్తం 29 నామినేషన్లు అమోదం అయినట్లు ఎన్ని కల రిటర్నింగ్‌ అధికారి బి.కర్రెన్న తెలిపారు. శనివారం స్థానిక మండల పరిషత కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యుల నామినేషన పత్రాలను పరిశీలించారు. మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండగా మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించగా మొత్తం 29 నామినేషన్లు దాఖ లు కాగా, అందులో టీడీపీ 9, వైసీపీ 16, ఇండిపెండెంట్లు 3, బీఎస్‌పీ 1 నామినేషన దాఖలు కాగ పరిశీలనలో అభ్యర్థులు అన్ని ధ్రువీకరణ పత్రాలను సమర్పించగా 29 నామినేషన్లు అమోదం తెలిపామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి కృష్ణ మోహన శర్మ, ఏవో అయూబ్‌ ఖాన, జూనియర్‌ అసిస్టెంట్‌ రమణ పాల్గొన్నారు.

సి.బెళగల్‌: స్థానిక మండల పరిషత కార్యాలయంలో శనివారం ఎంపీ టీసీ అభ్యర్థుల నామినేషన్లను ఆర్డీవో సందీప్‌కుమార్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నాగిని పరిశీలించారు. మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలకు 83 నామినేషన్లు దాఖలయ్యాయి. 83 నామినేషన్లు అర్హత కలిగి ఉన్నాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారితెలిపారు. ఈసందర్భంగా వన టౌన సీఐ శంకర్‌, త్రీటౌన సీఐ సమీర్‌ బాషా, ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు ప్రత్యేక పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాణెమ్మ, తహసీల్దార్‌ వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

కల్లూరు: కల్లూరులో ఎంపీటీసీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన పత్రాలను శనివారం మండల పరిషత కార్యాలయంలో ఎన్నికల రిట ర్నింగ్‌ అధికారి ఎం.నాగశివలీల, ఎంపీడీవో శ్రీనివాసులు పరిశీలించారు. కల్లూరు మండలంలో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలకు 67 మంది అభ్యర్థులు నామినేషన్లను అందజేశారు. అందులో 5 నామినేషన్లు తిరష్కరణకు గురి కాగా 62 మంది అభ్యర్థుల నామినేషన్లు పోటీకి అర్హత సాధించాయన్నారు. పోటీలో నిలిచిన నామినేషన్లలో పార్టీల వారీగా టీడీపీ-29, వైసీపీ-24, జనసేన-2, సీపీఎం-3. ఇండిపెండెంట్లు-4 ఉన్నారని ఆర్‌వో తెలిపారు.

Updated Date - Oct 25 , 2026 | 12:25 AM