నామినేషన్ల పరిశీలన
ABN , Publish Date - Oct 23 , 2026 | 11:31 PM
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అధికార యంత్రాంగం శిరివెళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది.
శిరివెళ్లలోని నామినేషన్ కేంద్రంపై ప్రత్యేక నిఘా
పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
శిరివెళ్ల, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి) : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అధికార యంత్రాంగం శిరివెళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. శిరివెళ్లలోని మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్, డిప్యూటీ కలెక్టర్ మనీషా శుక్రవారం పరిశీలించారు. నామినేషన్ల సమయం ముగిసేంత వరకు కేంద్రం వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. వారి వెంట ఆళ్లగడ్డ డీఎస్పీ రవి కుమార్, శిరివెళ్ల ఎస్‌ఐ మధుసూదన, సిబ్బంది ఉన్నారు.