Share News

చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:02 AM

మండలంలోని గుడికల్లు చెరువులో గుర్రపు డెక్క పేరుకుపోయింది. ఇటీవలే చెరువంత పూర్తిగా నిండిపోయిన గుర్రపు డెక్కను అధికారులు అడపదడపా తొలగించారు.

చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క
గుడికల్‌ చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క

ఎమ్మిగనూరు,మార్చి 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని గుడికల్లు చెరువులో గుర్రపు డెక్క పేరుకుపోయింది. ఇటీవలే చెరువంత పూర్తిగా నిండిపోయిన గుర్రపు డెక్కను అధికారులు అడపదడపా తొలగించారు. అయినప్పటికీ గుర్రపు డెక్క తిరిగి పెరుగుతోంది. చెరువు చుట్టూ ఉన్న గట్టు వెంబడి లోపలి వరకు విస్తరించింది.తొలగించకపోతే మరికొన్ని రోజులకు చెరువంతా విస్తరించే ప్రమా దం ఉంది. వేసవిలో ఎమ్మిగనూరు పట్టణానికి తాగునీరు అందించేందు గుడికల్‌ చెరువులో మున్పిపల్‌ అధికారులు నీటిని నిల్వ చేస్తున్నారు. ఎల్లెల్సీలో నిటి సరఫరా బంద్‌ అయినప్పటి నుంచి గుడికల్‌ చెరువులో ఉన్న నీటిని పట్టణ సమీపంలో ఉన్న ఎస్‌ఎస్‌ ట్యాంకులకు మళ్లించి అక్కడినుంచి పంప్‌హౌ్‌సల ద్వారా పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తారు. పట్టణానికి తాగునీరు అందిం చే చెరువును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాల్సిన అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోకపోవటంతో గుడికల్‌ చెరువులో గుర్రపు డెక్క రోజు రోజుకు ఏపుగా పెరుగుతూ విస్తరిస్తోంది. అంతేగాక చెరువు సమీపంలోని ఉన్న ఎల్లెల్సీ కాలువలో కూడా గుర్రపు డెక్క పెరుగుతోంది. ఇది నీట సరఫరాకు అడ్డంకిగా మారడమే కాక నీరు అపరిశుభ్రం అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Mar 23 , 2026 | 12:02 AM