ప్రమాద వ్యర్థాల నిర్వహణలో శాస్త్రీయ ప్రమాణాలు
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:17 PM
ప్రమాద వ్యర్థాల నిర్వహణ, నిల్వ, రవాణా తదితర అంశాల్లో సురక్షిత పద్ధతులు, శాస్త్రీయ ప్రమాణాలు తూచా తప్పకుండా అమలు చేయాలని ఏపీ ఎన్విరాన్ మెంటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఈఎంసీఎల్) చైర్మన్ పోలంరెడ్డి దినే్‌షరెడ్డి సూచించారు.
ఏపీఈఎంసీఎల్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్‌రెడ్డి
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రమాద వ్యర్థాల నిర్వహణ, నిల్వ, రవాణా తదితర అంశాల్లో సురక్షిత పద్ధతులు, శాస్త్రీయ ప్రమాణాలు తూచా తప్పకుండా అమలు చేయాలని ఏపీ ఎన్విరాన్ మెంటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఈఎంసీఎల్) చైర్మన్ పోలంరెడ్డి దినే్‌షరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంతో పాటు, కొలిమిగుండ్ల మండలంలోని అసెన్సన్ మర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌ను సందర్శించారు. అనంతరం సంబంధిత అధికారులు, పరిశ్రమల యజమానులకు పలు సూచనలు చేశారు. ప్రీ ప్రాసెసింగ్ చేసిన హానికర వ్యర్థాలను నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా సిమెంట్ పరిశ్రమలకు పంపాలని, నిర్వహణ వివరాలను ఏపీఈఎంసీఎల్ పోర్టల్‌లో తప్పకుండా నమోదు చేయాలని దినే్‌షరెడ్డి తెలిపారు. వ్యర్థాల రవాణాకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను వినియోగించటంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్జానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రమాదకర వ్యర్థాల నిర్వహణలో పర్యావరణానికి ఏ మాత్రం హానీ కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిశ్రమ ప్రాంగణంలోను పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అసెన్సన్ యూనిట్ రికార్డులను తనిఖీ చేయటంతో పాటు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీపీసీబీ జాయింట్ చీఫ్ ఇంజనీరు రమేష్, ఈఈ కిషోర్‌రెడ్డి, అసెన్సన్ యూనిట్ అధికారులు పాల్గొన్నారు.