Share News

మెగా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:38 AM

మాంటిస్సోరి విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్థానిక ఏ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాలలో మెగా వైజ్ఞానిక ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది.

మెగా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం
నమూనాను వివరిస్తున్న విద్యార్థినులు

ఆకట్టుకున్న విద్యార్థుల నమూనాలు

కర్నూలు ఎడ్యుకేషన్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మాంటిస్సోరి విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్థానిక ఏ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాలలో మెగా వైజ్ఞానిక ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సెయింట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపక చైర్మన్‌ సైయ్యంట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ ఐఐటీ హైదరాబాదు పద్మశ్రీ వీవీఆర్‌ మోహన్‌ రెడ్డి, పి.చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఈకార్యక్రమం మరో రెండురోజుల పాటు కొనసా గుతుంది. పంచతత్వ ఆకాశం, భూమి, జలం, అగ్ని, వాయువు ముఖ్య అంశాలుగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రధాన అంశాలుగా చేర్చారు. టెర్నెడో కాన్సప్ట్‌ రోబో సీయాను, వాటర్‌ రోబో, డీసీ హ్యాండ్‌, క్రాక్‌ జనరేటర్‌, ఫీచర్‌ వైర్‌లెస్‌ సిటి, డ్రోన్‌ టెక్నాలజీ, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ లైఫ్‌ ఆన్‌ స్పేస్‌ వంటి ప్రాజెక్టు నమూనాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటితో పాటు మ్యాజిక్‌సో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో డా.ప్రవీణ్‌, మాంటిస్సోరి పూర్వ విద్యార్థి మధు నారాయణ, మాంటిస్సోరి విద్యాసంస్థల వ్యవస్థాపకులు రాజశేఖర్‌, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 12:38 AM