Share News

విద్యార్థులతో పాఠశాలలు వెలిగిపోవాలి

ABN , Publish Date - May 07 , 2026 | 11:55 PM

జిల్లాలోని బడి ఈడు పిల్లలను బడిలో చేర్చడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో వెలిగిపోయేలా చూడాలని డీఈవో సుధాకర్‌, ఏపీసీ ఽలోక్‌నాఽథ్‌ పిలుపునిచ్చారు

విద్యార్థులతో పాఠశాలలు వెలిగిపోవాలి
అడ్మిషన్‌ ఇస్తున్న డీఈవో

బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించండి

రెండు రోజుల ప్రత్యేక డ్రైవ్‌

డీఈవో సుధాకర్‌, ఏపీసీ లోక్‌నాఽథ్‌

గోనెగండ్ల, మే 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని బడి ఈడు పిల్లలను బడిలో చేర్చడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో వెలిగిపోయేలా చూడాలని డీఈవో సుధాకర్‌, ఏపీసీ ఽలోక్‌నాఽథ్‌ పిలుపునిచ్చారు. గురువారం గోనెగండ్లలో బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరుతూ సంతమార్కెట్‌ నుంచి కురువ పేట పాఠశాల వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. కరువపేటలో బడి ఈడు పిల్లలు ఐదుగురిని ఒకటో తరగతిలో చేర్పించేందుకు ఆడ్మిషన్లను డీఈవో ఇచ్చారు. పిల్లల తల్లిదండ్రులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కంటే కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎక్కువ అని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగ్‌, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్న ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. దీని కోసం రెండు రోజుల పాటు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు డ్రాప్‌ అవుట్‌ లేకుండా చూడాలని ఉపాధ్యాయులను కోరారు. సర్వశిక్షా అభియాన్‌ సీఎంవో ధనరాజ్‌, ఎంఈవోలు రామాంజనేయులు, నీలకంఠ, హెచ్‌ఎం రవిప్రకాష్‌, ఎల్లప్ప, రాముడు, రహంతుల్లా, దిలీప్‌ కుమార్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 11:55 PM