పాఠశాలల అభివృద్ధే పీఎంశ్రీ లక్ష్యం
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:01 PM
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే పీఎంశ్రీ పథక లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ అనూరాధ తెలిపారు.
రాష్ట్ర విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనూరాధ
చాగలమర్రి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే పీఎంశ్రీ పథక లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ అనూరాధ తెలిపారు. శనివారం చాగలమర్రి లో పీఎంశ్రీ కింద ఎంపికైన జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో పీఎంశ్రీ కింద ఏర్పాటుచేసిన సైన్స్, గణితం, ఒకేషనల్, పాల్ ల్యాబ్‌లు, క్రీడా ప్రాంగణం, డిజిటల్ లైబ్రెరీ, స్మార్ట్ తరగతి గదులు, కిచెన్ గార్డెన్‌ను పరిశీలించారు. బాలికల కోసం తయారుచేసిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం తయారు చేయాలని ఏజెన్సీ మహిళలకు సూచించారు. ఆమె మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 44 ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయన్నారు. ఆయా పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులకు డిజిటల్ సాంకేతికతతో కూడిన విద్యను అందిస్తామన్నా రు. ముగ్గురు రాష్ట్రస్థాయి అధికారులు, డీఈవో, ఎస్‌ఎ్‌సఏ పీసీ, ఏఎంవోలు బృందాలుగా ఏర్పడి పీఎంశ్రీ కింద ఎంపికైన పాఠశాలలో చేపట్టిన పనులను పరిశీలించి నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈవో శేషశయనారెడ్డి, హెచ్‌ఎం శివలక్ష్మీ, పీడీ భారతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.