Share News

అర్హులందరికీ పథకాలు

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:19 AM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింజేస్తామని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల అన్నారు. గురువారం సాయంత్రం కొలుములపల్లె, బలపాలపల్లె గ్రామాల్లో ఇంటింటికీ టీడీపీ నిర్వహించారు.

అర్హులందరికీ పథకాలు
బలపాలపల్లెలో ఎమ్మెల్యే కోట్ల

బేతంచెర్ల, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింజేస్తామని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల అన్నారు. గురువారం సాయంత్రం కొలుములపల్లె, బలపాలపల్లె గ్రామాల్లో ఇంటింటికీ టీడీపీ నిర్వహించారు. కన్వీనర్‌ ఎల్ల నాగయ్య, పోలూరు శ్రీనివాస్‌ రెడ్డి, ఉన్నం సుధాకర్‌ చౌదరి, తిరుమల చౌదరి, జాకీరుల్లా బేగ్‌, బుగ్గన ప్రభాకర్‌ రెడ్డి, రామనాథం, జగదీష్‌, ఈశ్వరయ్య, కోటేష్‌, నాగరాజు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. గురువారం పట్టణంలోని 13వ వార్డు దుర్గాపేటలో ‘ఇంటింటికీ టీడీపీ’ నిర్వహించారు. ఈ రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. సీసీ రోడ్డు నిర్మించాలని, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని మహిళలు కోరగా పరిష్కరించాలని కమిషనర్‌ హరిప్రసాద్‌ను కోరారు. కమిషనర్‌ హరిప్రసాద్‌, కన్వీనర్‌ బుగ్గన ప్రసన్న లక్ష్మి, పార్టీ నాయకులు భాస్కర్‌ రెడ్డి, భీమేశ్వర్‌ రెడ్డి, బుగ్గన ప్రభాకర్‌ రెడ్డి, జాకీరుల్లా బేగ్‌, మేకల నాగరాజు, రూబేన్‌, టైలర్‌ రాముడు, గూటం శివ పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 12:19 AM