భారంగా అటవీ సంరక్షణ
ABN , Publish Date - May 27 , 2026 | 12:00 AM
ఫారెస్టు సబ్ డివిజన్‌లో సిబ్బంది కొరత వెంటాడుతోంది.
రుద్రవరం, చెలిమ రేంజ్‌లో వేధిస్తున్న సిబ్బంది కొరత
రుద్రవరం, మే 26 (ఆంధ్రజ్యోతి): ఫారెస్టు సబ్ డివిజన్‌లో సిబ్బంది కొరత వెంటాడుతోంది. అటవీ డివిజన్ 42,122 హెక్టార్లలో చెలిమ రేంజ్ 23740.53 హెక్ట్లార్లలో విస్తరించి ఉంది. అడవులు మానవుని సంరక్షణకు అవసరం, అటవీ సంరక్షణతో జీవ వైవిధ్యం పెంపొందుతుంది. నల్లమల అడవుల సంరక్షణకు తగినంత సిబ్బంది లేకపోవడం ఇబ్బంగా మారిందని అటవీ అధికారులు అంటున్నారు. .
రుద్రవరం ఫారెస్టు రేంజ్ ఇలా..
రుద్రవరం ఫారెస్టు రేంజ్‌లో రుద్రవరం, న్నూతల, ఆలమూరు, అహోబిళం, డీవీపెంట సెక్షన్లు పరిధిలో 14 బీట్‌లు ఉన్నాయి. ఇందులో బీట్ ఆఫీసర్లు-14, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు-14 అవసరం కాగా. ఇక్కడ తొమ్మిదిమంది మాత్రమే ఉన్నారు. అలాగే అయిదుగురు సెక్షన ఆఫీసర్లు అవసరం కాగా, ఒక డీఆర్వో, ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు.
చెలిమ రేంజ్ ఇలా..
రుద్రవరం ఫారెస్టు సబ్ డివిజన్‌లోని చెలిమరేంజ్ 23740.53 హెక్టార్లలో విస్తరించి ఉంది. వీటి పరిధిలో పెద్దకంబలూరు, పచ్చర్ల, చెలిమసెక్షన్లు ఉన్నాయి. ఈ పరిధిలో 8 బీట్‌లున్నాయి. సిబ్బంది అరకొరగా ఉన్నారు. దీంతో అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కష్టతరంగా మారుతోందని అధికారులు అంటున్నారు. జిల్లా అటవీ అధికారులు తగినంత సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించా
రుద్రవరం ఫారెస్టు సబ్ డివిజను పరిధిలో సిబ్బంది కొరత ఉంది. ఈ విషయానిన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో రిక్రూట్‌మెంట్ నిర్వహించి ిభర్తీ చేయనున్నాం. - శ్రీనివాసరెడ్డి, సబ్ డీఎ్‌ఫవో, రుద్రవరం