డీజిల్, పెట్రోల్ కొరత
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:55 PM
బనగానపల్లె నియోజకవర్గంలో డీజిల్, పెట్రోల్ కొరత వేధిస్తోంది. కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె, సంజామల, కోవెలకుంట్ల మండలాల్లోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె ప్రాంతంలో నాపరాళ్ల రవాణా కోసం నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుంటాయి
నిలిచిపోయిన సరుకు రవాణా ఫ పరిశ్రమల యజమానుల ఇబ్బందులు ఫ వాహనదారుల కష్టాలు
బనగానపల్లె, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో 6 పెట్రోల్ బంకులు ఉండగా, రోజూ ఏదో ఒక పెట్రోల్ బంకు వద్ద నోస్టాక్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయి. అవసరం మేరకు బనగానపల్లెకు పెట్రోల్, డీజల్ సరఫరా కాకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. సబ్‌జైల్‌కు సంబంధించిన ఓ బంకుకు డీజల్ రావడంతో వాహనదారులు క్యూ కట్టారు.
కొలిమిగుండ్ల బనగానపల్లె నియోజకవర్గంలో డీజిల్, పెట్రోల్ కొరత వేధిస్తోంది. కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె, సంజామల, కోవెలకుంట్ల మండలాల్లోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె ప్రాంతంలో నాపరాళ్ల రవాణా కోసం నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. డీజిల్ కొరత కారణంగా లారీలు, ట్రాక్టర్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీని కారనంగా పరిశ్రమలు నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది, ఉపాధి కోల్పాతామని కార్మికులు, పరిశ్రమల యజమానులు వాపోతున్నారు. ప్రభుత్వాధికారులు స్పందంచి డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బేతంచెర్ల: పట్టణంలోని పెట్రోల్ బంకు వద్ద వాహనదారులుబుధవారం సాయంత్రం బారులుదీరారు. వారం నుంచి పెట్రోల్ కొరత ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో ఆరు బంకులు ఉన్నాయి., అయితే ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా సరిగా లేకపోవడంతో కొరత ఏర్పడిందని బంకుల యజమానులు తెలిపారు. బుక్‌చేసిన వారం తర్వాత పెట్రోలు వచ్చిందని భారత్ పెట్రోల్ బంకు యజమాని తెలిపారు. మళ్లీ కొరత వస్తుందన్న అనుమానంతో వాహనదారులు ఎగబడ్డారని, క్యాన్లలో పెట్రోలు నింపుకుని వెళుతున్నారని తెలిపారు.