రైతు సమస్యలపై ఎస్సీ కమిషన్ పరిశీలన
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:43 PM
మండల కేంద్రంలోని బిలకలగూడూరు గ్రామానికి చెందిన దళిత రైతుల భూసమస్యలపై మంగళవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన్న రాముడు, సభ్యులు బాబు శ్రీపతి, మేకల దాసు.. మరికొందరు సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.
గడివేముల, జూన్ 23 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని బిలకలగూడూరు గ్రామానికి చెందిన దళిత రైతుల భూసమస్యలపై మంగళవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన్న రాముడు, సభ్యులు బాబు శ్రీపతి, మేకల దాసు.. మరికొందరు సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. దళిత రైతుల భూములను తీసుకున్న అనంతరం జెఎస్‌డబ్ల్యూ సంస్థ తగిన పరిహారం చెల్లించలేదని, హామీ మేరకు ఉద్యోగాలు కల్పించడం లేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ పర్యటన నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. దళిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం కంపెనీ సిబ్బందితో సమావేశమై దళిత రైతుల సమస్యల వివరాలను సేకరించారు. ఈ వివరాలను ఎస్సీ కమిషన్ చైర్మన్ జోహర్ దృష్టికి తీసుకెళ్లి దళిత రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్‌డీఓ విశ్వనాథ్, ఏఎస్‌పీ మందజావలి అల్‌పోన్స, తహసీల్దార్ వెంకటరమణ, సోషల్ వేల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ చింతామణి, బిలకలగూడురు రైతులు పాల్గొన్నారు.