Share News

స్థానికానికి సై

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:09 PM

‘సర్‌’ ప్రక్రియ పూర్తయిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడైనా రావచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

స్థానికానికి సై


ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధం

పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్లు జాబితా సిద్ధం

కర్నూలు జిల్లాలో 26, నంద్యాల జిల్లాలో 28 జడ్పీటీసీ స్థానాలు

రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం

‘సర్‌’ ప్రక్రియ పూర్తయిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడైనా రావచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నోటిఫికేషన్‌ ఎప్పుడొచ్చినా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏక్షణంలో నోటిఫికేషన్‌ జారీచేసినా పక్కాగా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. రాజకీయ శిబిరాల్లో కూడా వేడి రాజుకుంది. జడ్పీ పీఠం, జడ్పీటీసీ స్థానాలు ఏ సామాజికవర్గానికి రిజర్వు చేస్తారు? బరిలో దిగేది ఎవరు? ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైంది.

కర్నూలు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జడ్పీకి 67 ఏళ్ల చరిత్ర ఉంది. 16మంది జిల్లా పరిషత్‌ చైర్మన్లు పనిచేశారు. ఉమ్మడి జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా దివంగత మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి 1959 డిసెంబరు 23న బాధ్యతలు చేపట్టి 1962 జనవరి 27 వరకు కొనసాగారు. 2022లో నంద్యాల జిల్లాగా ఏర్పా టైంది. జడ్పీ పదవీ కాలం ముగిసే వరకు అంటే ఈఏడాది సెప్టెం బరు 24 వరకు ఉమ్మడి జడ్పీగానే కొనసాగింది. ఉమ్మడి జడ్పీ చివరి చైర్మన్‌గా ఎర్రబోతుల పాపిరెడ్డి కొనసాగారు. నంద్యాల జిల్లాను కొత్తగా జిల్లా పరిషత్‌గా ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉ త్తర్వులు జారీ చేసింది. 28 జడ్పీటీసీ సభ్యులతో నూతన జడ్పీగా ఆవిర్భవించింది. కర్నూలు జడ్పీ 26 మండలాలతో మిగిలింది. రెండు జిల్లాలోనూ జడ్పీ, మం డల పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమైంది. నంద్యాల జడ్పీకి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి పర్యవే క్షణలో ఎన్నిలక నిర్వహణకు అవసర మైన ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేశారు. ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణ సిబ్బందిని గుర్తించారు.

ఓటర్ల జాబితా సిద్ధం

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో జడ్పీ, ఎంపీపీ ఎన్నికల నిర్వహణలో ఎంతో కీలకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2026 జనవరి 1నాటికి ఉన్న జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

కర్నూలు జిల్లాలోని 26 మండలాల్లో

జిల్లాలోని 26 మండలాల్లో 12,50,166 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మహిళలు 6,28,834, పురుషులు 6,21,167 మంది ఓటర్లు ఉంటే, ఇతర ఓటర్లు 165 మంది ఉన్నారు. సామాజి కవర్గాల వారీగా పరిశీలిస్తే ఎస్సీ ఓటర్లు 2,33,881, ఎస్టీ ఓటర్లు 17,119, బీసీ ఓటర్లు 9,05,611, ఇతరులు 93,555 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో బీసీ లు 72.5 శాతం, ఎస్సీలు 18.64 శాతం ఉంటే, ఓసీలు 7.52 శాతం ఉన్నారు.

పోలింగ్‌ స్టేషన్లు.. బ్యాలెట్‌ బాక్కులు

కర్నూలు జిల్లాలో 648 గ్రామా ల్లో 1,432 పోలింగ్‌ స్టేషన్లు గుర్తించారు. ఐదు, ఆపైన పోలిం గ్‌ స్టేషన్లు ఉన్న గ్రామాలు 30 ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు 8,287 మంది సిబ్బంది అవసరం ఉంది. వారి లో పీవోలు 1,579, ఏపీవోలు 1,579, ఓపీవోలు 5,129 మంది కావాలని నివేదిక సిద్ధం చేశారు. 1,811 బ్యాలెట్‌ బాక్సులు అవసరం ఉంటే, 1,829 బాక్కులు అందుబాటులో ఉన్నాయి.

నంద్యాల జిల్లాలో 599 గ్రామాల్లో 1,238 పోలింగ్‌ స్టేషన్లు గుర్తించారు. 7,122 మంది ఎన్నికల నిర్వహణ సిబ్బంది అవసరం ఉంది. వారిలో పీవోలు 1,363, ఏపీవోలు 1,363, ఓపీవోలు 4,396 మంది అవసరం ఉందని అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. మొత్తం 2,013 బ్యాలెట్‌ బ్యాక్సులు అవసరం కాగా 1,670 అందుబాటులో ఉన్నాయి.

నంద్యాల జిల్లాలోని 28 మండలాల్లో..

నంద్యాల జిల్లాలో 28మండలాల్లో 10,61,817 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మహిళలు 5,39,819 పురుషులు 5,21,877, ఇతరులు 121 మంది ఓటర్లు ఉన్నారు. సామాజికవర్గాలు వారిగా పరిశీలిస్తే ఎస్సీ ఓటర్లు 2,28,339, ఎస్సీ ఓటర్లు 32,417, బీసీ ఓటర్లు 5,81,259, ఇతరులు (ఓసీలు) ఓటర్లు 2,19,802 ఉన్నారు

కర్నూలు జిల్లాలో అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 367, సమస్యాత్మక కేంద్రాలు 526, సాధారణ పోలింగ్‌ కేంద్రాలు 539గా అధికారులు గుర్తించారు. నంద్యాల జిల్లాలో అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 286, సమస్యాత్మక కేంద్రాలు 459, సాధారణ పోలింగ్‌ కేంద్రాలు 493 గుర్తించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పీఎ్‌సలపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు సీసీ కెమెరాల నిఘాలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టబోతున్నారు.

రాజకీయ శిబిరాల్లో..

ఎన్నికలను అడ్డుకోవాలని వైసీపీ చేసిన కుట్రకు బ్రేక్‌ పడింది. స్థానిక ఎన్నికల నిర్వహించొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో రాజకీయ శిబిరాల్లో వేడి మొదలైంది. రెండు జిల్లాల్లో జడ్పీ చైర్మన్‌ పీఠంతో పాటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండలాధీశుల స్థానాలు ఏసామాజిక వర్గానికి రిజర్వేషన్‌ కల్పిస్తారు? బరిలో నిలిచేది ఎవరు? ప్రత్యర్థులతో తలపడేది ఎవరు? సామాజికవర్గాల వారీగా అభ్యర్థుల కోసం పార్టీలు అన్వేషణ షురూ చేశారు. బలమైన అభ్య ర్థులను ఎన్నికల బరిలో దింపేందుకు అధికార కూటమి, ప్రతిపక్ష పార్టీలు తెరవెనుక వ్యూహాలకు పదును పెట్టారు.

జిల్లాల వారీగా వివరాలు

వివరాలు కర్నూలు నంద్యాల

మండలాలు 26 28

గ్రామ పంచాయతీలు 484 489

జడ్పీటీసీలు 26 28

ఎంపీపీలు 26 28

ఎంపీటీసీలు 432 377

పోలింగ్‌ కేంద్రాలు 1,432 1,248

Updated Date - Oct 09 , 2026 | 11:09 PM