Share News

ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాలి

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:19 AM

వర్షపు నీటి ప్రతి బొట్టునూ ఒడిసి పట్టాలని కలెక్టర్‌ డా.ఏ.సిరి అన్నారు. గురువారం మండలంలోని డి.బెళగల్‌ గ్రామంలోని చెక్‌డ్యాం, నాగమ్మ చెరువు కలెక్టర్‌, జేసీ, అధికారులు, రైతులతో కలిసి పరిశీలించారు.

ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాలి
డి.బెళగల్‌లో చెక్‌డ్యామ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌, జేసీ

నీటి భద్రతే లక్ష్యంగా ‘జలధార - జలహారతి’

కలెక్టర్‌ డా.ఏ. సిరి

నాగమ్మ చెరువు, చెక్‌ డ్యామ్‌ను పరిశీలించిన అధికారులు

కోసిగి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): వర్షపు నీటి ప్రతి బొట్టునూ ఒడిసి పట్టాలని కలెక్టర్‌ డా.ఏ.సిరి అన్నారు. గురువారం మండలంలోని డి.బెళగల్‌ గ్రామంలోని చెక్‌డ్యాం, నాగమ్మ చెరువు కలెక్టర్‌, జేసీ, అధికారులు, రైతులతో కలిసి పరిశీలించారు. డి.బెళగల్‌లోని రైతు సేవా కేంద్రంలో గ్రామస్థాయి నీటి ప్రణాళికపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షం నీటిలో ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా.. జలధార - జలహారతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. వంద రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా చెరువులు, చెక్‌ డ్యామ్‌ల మరమ్మతులు, పూడికతీత పనులను ఉపాధి హామీ పథకం ద్వారా వేగవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఏళ్ల తరబడి నిరూపయోగంగా ఉన్న నాగమ్మ చెరువులో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి అందుబా టులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. చెక్‌ డ్యామ్‌లను ఉపాధి హామీ నిధులతో నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. రైతులతో మాట్లాడుతూ పంటల సరళిలో రైతుల్లో మార్పులు రావాలని, తక్కువ శాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు సాగు విధానంలో మార్పులు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, ఆదోని ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ అజయ్‌కుమార్‌, డ్వామా పీడీ నరసింహారెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి, ఎల్లెల్సీ చైర్మన్‌ టిప్పు సుల్తాన్‌, టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చింతలగేని నర్సారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:19 AM