Share News

హంద్రీ, కేసీ కాలువను కాపాడండి

ABN , Publish Date - Jan 24 , 2026 | 01:01 AM

నగరంలో ప్రవహిస్తున్న హంద్రీ నది, వక్కెరవాగు, కేసి కాలువలను కాపాడాలని ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక కన్వీనర్‌ రామక్రిష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.

హంద్రీ, కేసీ కాలువను కాపాడండి
నిరసన తెలుపుతున్న నాయకులు

కార్పొరేషన్‌ను ముట్టడించిన ప్రజాస్వామ్య సంఘాలు

కర్నూలు న్యూసిటీ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): నగరంలో ప్రవహిస్తున్న హంద్రీ నది, వక్కెరవాగు, కేసి కాలువలను కాపాడాలని ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక కన్వీనర్‌ రామక్రిష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ప్రజా సంఘా లనాయకులు నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. హంద్రీ, కేసీ కెనాల్‌, వక్కెర వాగుల్లో చెత్తా చెదారాన్ని, ముళ్లకంపను తొలగించాలని డిమాండ్‌ చేశారు. నదుల దురాక్రమణను అరికట్టాలని అన్నారు. నగరంలో కాలువలు, నదుల నిర్వహణ అద్వాన్నంగా ఉందని, మురుకినీరు కేసి కెనాల్‌లో ప్రత్యుంగా కలుస్తుందన్నారు. వాటిని మళ్లించడానికి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్తను ఏర్పాటు చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాక్రిష్ణ మాట్లాడుతూ నగర పాలక సంస్థ అధికారులు ప్రజల నుంచి పన్నులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని అన్నారు. నగరంలో నీటి సరఫరా కోసం రెండవ సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. హంద్రీ, వక్కెర వాగడులు ఆక్రమణకు గురికాకుండ చర్యలు తీసుకోవాలన్నారు. నగరాన్ని స్మార్ట్‌ సిటిగా అభివృద్ది చేయాలని సూచించారు. అనంతరం నగర పాలక సంస్థ మేనేజర్‌ చిన్నరాముడుకు వినతి పత్రం అందజేశారు. కిసాన్‌ సమాఖ్య నాయకులు శ్రీనివాసరావు, సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు వాడాల చంద్రశేఖర్‌రెడ్డి, ప్రజాభ్యుదయ సంస్థ నాయకులు శ్రీనివాసరావు, రాయలసీమ విద్యావంతు వేదిక కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 01:01 AM