Share News

పంటలను కాపాడుకోవాలి

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:17 AM

వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని పంటలను కాపాడుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులను కోరారు.

పంటలను కాపాడుకోవాలి
పసుపుల గ్రామంలో మొక్కజొన్నను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

వ్యవసాయ శాస్త్రవేత్తల పిలుపు

బనగానపల్లె, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని పంటలను కాపాడుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులను కోరారు. మంగళవారం బనగానపల్లె మండలంలోని పసుపుల, పాతపాడు, యాగంటిపల్లె గ్రామాల్లో నంద్యాల పరిధోధనా స్థానం శాస్త్రవేత్తలు, మహానంది వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు పర్యటించారు. రైతులతో శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఇప్పటికే వేసిన మొక్కజొన్న, కంది, తదితర మెట్ట పంటలను ఎల్‌నినో ప్రభావం వల్ల ఎలా కాపాడుకావాలో రైతులకు వివరించారు. వర్షాధార పంటలను బెట్ట పరిస్థితుల నుంచి ఎదుర్కొవడానికి 19.19.19 రసాయనిక ఎరువులను, పొటాషియం నైట్రేట్‌ ద్రావణాన్ని పైరుపై పిచికారి చేసుకోవాలన్నారు. రబీలో ముందస్తుగా కంది, ఆముదం, జొన్న, సద్ద పం టలు రైతులు సాగుచేయాలని కోరారు. రైతులు అధికంగా పెట్టుబడులు పెట్టకూడదని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్‌ సుబ్బరామిరెడ్డి, డాక్టర్‌ అశోక్‌కుమార్‌, రవికుమార్‌రెడ్డి, పుల్లిబాయి, ఏవో సుబ్బారెడ్డి, రైతుసేవా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 12:17 AM