Share News

న్యుమోనియాపై సాన్స్‌ ప్రచారం

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:17 PM

ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా నివారణ, శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా సాన్స్‌ (సోషల్‌ ఎవేర్‌నెస్‌ అండ్‌ యాక్షన్‌ టూ న్యూట్రలైజ్‌ న్యూమోనియా సక్సె్‌సఫుల్లీ) 2026-27 ప్రత్యేక ప్రచారం ప్రారంభించినట్లు కర్నూలు డీఎంహెచ్‌వో డా.వై. కామేశ్వర ప్రసాద్‌ వెల్లడించారు.

న్యుమోనియాపై సాన్స్‌ ప్రచారం
సాన్స్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డీఎంహెచ్‌వో

డీఎంహెచ్‌వో డా.వై. కామేశ్వర ప్రసాద్‌

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా నివారణ, శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా సాన్స్‌ (సోషల్‌ ఎవేర్‌నెస్‌ అండ్‌ యాక్షన్‌ టూ న్యూట్రలైజ్‌ న్యూమోనియా సక్సె్‌సఫుల్లీ) 2026-27 ప్రత్యేక ప్రచారం ప్రారంభించినట్లు కర్నూలు డీఎంహెచ్‌వో డా.వై. కామేశ్వర ప్రసాద్‌ వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం సాన్స్‌ పోస్టర్‌ను డీఎంహెచ్‌వో ఆవిష్కరించారు. ఐదేళ్లలో చిన్నారుల్లో న్యుమోనియా నివారణ శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా సాన్స్‌ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. శీతాకా లం ప్రారంభం కావడంతో చిన్నారులు, వృద్ధులు ఈ వ్యాధి బారిన పడుతారని అన్నారు. నిమోనియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ అని, దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయమని అన్నారు. సాన్స్‌ కార్యక్రమం నవంబరు 12 నుంచి 2027 ఫిబ్రవరి 28వ తేదీ వరకు నాలుగు నెలలపాటు జరుగుతుందని తెలిపారు. జిల్లా టీబీ ఆఫీసర్‌ డా.ఎల్‌.భాస్కర్‌, ఎన్‌హెచ్‌ఎం అధికారి హేమలత, సంచార చికిత్స కార్యక్రమ నోడల్‌ అధికారి డా.విశ్వేశ్వరరెడ్డి, డీఎంవో వెంకటేశ్వర్లు, జిల్లాగణాంకాధికారి హేమసుందరం ఉన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 11:18 PM