ఘనంగా సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:43 PM
మండలంలోని అన్ని గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు.
కొండ దిగిన ఉమా మహేశ్వరస్వామి
ఐదు గ్రామాల్లో ప్రత్యేక పూజలు
పార్వేటలో మొక్కులు తీర్చుకున్న భక్తులు
బనగానపల్లె, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. యాగంటి ఉమామహేశ్వరస్వామి పార్వేటు ఉత్సవానికి ఎర్రమల కొండలు దిగారు. ప్రత్యేక పల్లకిలో ఉమామహేశ్వరస్వామి గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు ఐదు గ్రామాల్లో పర్యటించారు. యాగంటి ఆలయ చైర్మన్ బండి మౌళీశ్వరరెడ్డి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మహేశ్, పాలకవర్గ సభ్యులు తిరుమలయ్య, భరతుడు, ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ విగ్రహాలకు యాగంటిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాజాభజంత్రీలతో పార్వేట ఉత్సవాలకు బయలు రేరారు. కొండదిగిన ఉమామహేశ్వరస్వామి వారు పాతపాడుకు చేరుకున్నారు. అక్కడ నుంచి గురువారం సాయంత్రం 3 గంటల నుంచి మీరాపురం చేరుకొని, అక్కడ ఊరేగింపు నిర్వహించారు. మీరాపురం, యాగంటిపల్లె గ్రామాల్లో శ్రీరామసీతమ్మ విగ్రహాలను ఉమామహేశ్వస్వామి వెంట ఊరేగింపు నిర్వహించారు. యాగంటిపల్లెలో ఊరేగింపు తర్వాత సాధుకొట్టం, మాదాసుపల్లె గ్రామాల్లో ఊరేగింపు కొనసాగింది. ఆయా గ్రామాల ప్రజలు స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పార్వేటను పాతపాడులో ఊరేగింపు, పార్వేటు ఉత్సవాల అనంతరం యథావిఽధిగా ఉత్సవ మూర్తులు యాగంటి క్షేత్రానికి చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బనగానపల్లె సీఐ ప్రవీన్‌కుమార్, ఎస్‌ఐ దుగ్గిరెడ్డి, కల్పన, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.