Share News

పారిశుధ్య కార్మికులు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:23 AM

క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులు అప్రమత్తంగా ఉండి మాదకద్రవ్యాల రవాణాను గుర్తిస్తే వెంటనే ఈగల్‌ (ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూఫ్‌ ఫర్‌ లా ఎనఫోర్స్‌మెంట్‌)కు సమాచారమివ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆదేశించారు.

పారిశుధ్య కార్మికులు అప్రమత్తంగా ఉండాలి
పారిశుధ్య కార్మికులకు అవగాహన కల్పిస్తున్న ఈగల్‌ బృందం సభ్యులు

నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, జూన 1(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులు అప్రమత్తంగా ఉండి మాదకద్రవ్యాల రవాణాను గుర్తిస్తే వెంటనే ఈగల్‌ (ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూఫ్‌ ఫర్‌ లా ఎనఫోర్స్‌మెంట్‌)కు సమాచారమివ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆదేశించారు. సోమవా రం 5వ శానిటేషన డివిజన కార్యాలయం లో ఈగల్‌ టీం అధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై పారిశుధ్ద్య కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఎక్కడైనా డ్రగ్స్‌, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, విక్ర యం, సరఫరా లేదా రవాణా జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే ఈగల్‌ ట్రోల్‌ఫ్రీ నెంబర్‌ 1972కు సమాచారం అం దించాలన్నారు. ఈగల్‌ సభ్యు లు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈగల్‌ ఎస్‌ఐ సుజన, టీం సభ్యులు ఎలిషా, మాసుంవలి, శానిటేషన ఇనస్పెక్టర్‌ అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 12:23 AM