పారిశుధ్య కార్మికుల నిరసన
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:47 AM
తమను విధుల్లో తీసుకోవాలని కోరుతూ శనివారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి పద్మా వతి ఏజెన్సీ ఎదుట పారిశుధ్య కార్మికులు నిరసనకు దిగారు.
కర్నూలు హాస్పిటల్, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): తమను విధుల్లో తీసుకోవాలని కోరుతూ శనివారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి పద్మా వతి ఏజెన్సీ ఎదుట పారిశుధ్య కార్మికులు నిరసనకు దిగారు. కొంత మందిని కార్మికులను అకారణంగా తొలగించారని శనివారం ఏజెన్సీ ఆఫీసు ఎదుట వాదనకు దిగారు. ఉదయం, రాత్రి షిఫ్టుల్లో విధుల్లో ఉన్న కార్మికులు దాదాపు 100 మంది దాదాపు అరగంట నిరసన చేప ట్టారు. కొందరికీ వేతనాలు రూ.600, రూ.700 మరికొందరికి రూ.1000, రూ.1,200 వేతనాలు తక్కువ పడుతున్నాయని, సమస్యను పరిష్కరిం చాలని మేనేజర్‌ను కోరారు. అనంతరం ఏజెన్సీ మేనేజర్ రత్నరాజు మాట్లాడుతూ ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సమస్య ను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు తమ ఆందోళనను విరమించారు.