పడకేసిన పాలన
ABN , Publish Date - May 22 , 2026 | 12:07 AM
మండలంలోని ఎం.పెండేకల్, ముద్దవరం, అంబాపురం, బలపాలపల్లె, ఆర్‌ఎస్ రంగాపుర గ్రామాల్లో ఏ వీధిలో చూసినా మురుగు రోడ్లపై కనిపిస్తోంది.
కొరవడిన పారిశుధ్య నిర్వహణ
ముగిసిన సర్పంచుల పదవీకాలం, పత్తాలేని ప్రత్యేకాధికారులు
బేతంచెర్ల, మే 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎం.పెండేకల్, ముద్దవరం, అంబాపురం, బలపాలపల్లె, ఆర్‌ఎస్ రంగాపుర గ్రామాల్లో ఏ వీధిలో చూసినా మురుగు రోడ్లపై కనిపిస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగియడంతో పారిశుధ్య పనుల పర్యవేక్షణ కొరవడింది. రాత్రిళ్లు రోడ్డుపై నడిచి వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. డ్రైనేజీని శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం నిండి దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకాధికారులు స్పందించి పారిశుధ్య పనులు చేయించాలని కోరుతున్నారు.
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోనూ ఇంతే..
ఆళ్లగడ్డ, మే 21(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ మున్సిపాలిటి పరిధిలోని పడకండ్లలో పారిశధ్యం పడకేసింది. ప్రధాన రహదారిలో ఉన్న ప్రాఽథమిక ఆరోగ్య ఉప కేంద్రం వద్ద మురుగు సీసీ రోడ్డుపై పారుతోంది. దీంతో ఆసుపత్రికి వచ్చేందుకు రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.