పకడ్బందీగా చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:18 AM
ప్రతి ఇంటి నుంచి పకడ్బందీగా చెత్తను సేకరించి, పారిశుధ్య నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సిరి ఆదేశించారు. శనివారం కల్లూరు మండలం పర్ల గ్రామంలో జీరో-గ్యాప్ శానిటేషన్ ఆంధ్రా ర్యాలీని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డితో కలిసి ప్రారంభించారు. గ్రామ సచివాలయం, పీహెచ్‌సీ ప్రాంగణంలో మోక్కలు నాటారు
పర్ల గ్రామంలో స్వచ్ఛరథాన్ని ప్రారంభించిన కలెక్టర్ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటి నుంచి పకడ్బందీగా చెత్తను సేకరించి, పారిశుధ్య నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సిరి ఆదేశించారు. శనివారం కల్లూరు మండలం పర్ల గ్రామంలో జీరో-గ్యాప్ శానిటేషన్ ఆంధ్రా ర్యాలీని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డితో కలిసి ప్రారంభించారు. గ్రామ సచివాలయం, పీహెచ్‌సీ ప్రాంగణంలో మోక్కలు నాటారు. ప్రతి గ్రామంలో ఇంటింటి చెత్త సకరణ తప్పనిసరిగా చేయానిని, తడి, పొడి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జీరో-గ్యాప్ శానిటైషన్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజల భాగ్యస్వామ్యం కీలకమన్నారు. రాష్ట్రం ప్రభుత్వం స్వఛ్ఛరథాలను ప్రవేశపెట్టిందని కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో 8 మండలాలకు స్వఛ్చరథాలు వచ్చాయని, రెండో దశలో 8, మూడవ దశలో 9 స్వఛ్చరథాలు వస్తాయని క తెలిపారు. ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి భాద్యత అన్నారు. రాబోయో తరాలకు స్వఛ్చమైన వాతావరణం అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జడ్పీ సీఈవో నాసరరెడ్డి, ఆర్డీవో సందీ్‌పకుమార్, డీపీవో భాస్కర్, కల్లూరు తహసీల్దార్ కె.ఆంజనేయులు, ఎంపీడీవో నాగశేషాచలరెడ్డి పాల్గొన్నారు.