Share News

పోటెత్తిన సంగమేశ్వరం

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:01 AM

కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం భక్తజనంతో పోటెత్తింది. శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా సంగమేశ్వరస్వామి దర్శనార్థం తరలిరావడంతో సంగమ తీరం పోటెత్తింది.

పోటెత్తిన సంగమేశ్వరం
భక్తులతో పోటెత్తిన సంగమేశ్వరాలయం

వేలాదిగా తరలి వచ్చిన భక్తులు

దర్శనం కోసం గంటల కొద్ది నిరీక్షణ

తెలంగాణ మరబోట్లను నిలిపివేసిన కొత్తపల్లి పోలీసులు

కొత్తపల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం భక్తజనంతో పోటెత్తింది. శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా సంగమేశ్వరస్వామి దర్శనార్థం తరలిరావడంతో సంగమ తీరం పోటెత్తింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల సమయంలో భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పురోహితుడు తెలక పల్లి రఘురామశర్మ వేపదారు శివలింగ స్పర్శ దర్శనం నిలిపివేసి గర్భాలయ ముఖమండపం నుంచే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. భక్తులు వేలాదిగా తరలిరావడంతో స్వామివారి దర్శనం కోసం గంటల కొద్ది నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని సోమశిల నుంచి భక్తులు సంగమేశ్వరం దర్శించుకోవాలంటే కృష్ణానదిలో మరబోట్ల ద్వారా రావాల్సి ఉంటుంది. అయితే.. మరబోట్లకు లైసెన్సు లేదని కొత్తపల్లి పోలీసులు రాకపోకలు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఏది ఏమైనా ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సంగమే శ్వరానికి వేలాది మంది భక్తులు దర్శించుకో వడంతో సంగమేశ్వరం భక్తులతో నిండిపోయింది.

Updated Date - Jul 26 , 2026 | 12:01 AM