Share News

జలాధివాసం వీడిన సంగమేశ్వరాలయం

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:52 PM

మండ లంలోని శ్రీలలితా సంగమేశ్వర ఆలయం జలాధివాసం వీడింది.

జలాధివాసం వీడిన  సంగమేశ్వరాలయం
నదీ జలాల నుంచి పూర్తిగా బయల్పడిన సంగమేశ్వరాలయం

మరో రెండు రోజుల్లో వేపదారు శివలింగ దర్శనం

గతేడాది ఇదే రోజున బయల్పడిన క్షేత్రం

ఆత్మకూరు/కొత్తపల్లి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): మండ లంలోని శ్రీలలితా సంగమేశ్వర ఆలయం జలాధివాసం వీడింది. గురువారం సాయంత్రం 6గంటల సమయానికి శ్రీశైల జలాశ యం గరిష్ఠం నీటిమట్టం 885 అడుగులకు 842.20 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్‌ గరిష్ఠ నీటి సామర్థ్యం 215.8070టీఎంసీలు 65.0461 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. సంగమేశ్వరాలయం పూర్తిగా బయల్పడినప్పటికీ క్షేత్రానికి చేరుకునే రోడ్డు మార్గం బురదమయంగా ఉంది. గర్భాలయంలో కూడా రెండు అడుగుల మేర నీటినిల్వలు నిలిచి ఉన్నాయి. శని, ఆదివారాల్లో మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపింగ్‌ చేయనున్నారు. ఆతర్వాత ఆలయాన్ని శుద్ధిచేసి సోమవారం నుంచి నిత్యపూజలను యథా విధిగా కొన సాగించనున్నారు. 2024 జూలై 23న శ్రీశైలానికి వరద కొనసాగడంతో నీట మునిగిన సం గమేశ్వరాలయం 2025 మార్చి 19న బయల్పడింది. ఆ తర్వాత జూన్‌ 15న నీట ముని గిన సంగమేశ్వరుడు 277రోజుల పాటు జలాధివాసమై 2026 లోనూ మార్చి 19న బయల్పడటం గమనార్హం. గురువారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చ కులు తెలకపల్లి రఘురామశర్మ గర్భాలయంలోని వేపదారు శివలింగానికి అభిషేకాలు చేశారు. క్షేత్ర పరిధిలోని పలు ఉప ఆలయాల్లో కూడా పూజలు చేపట్టారు. ఇదిలావుంటే శ్రీశైల జలాశయంలో 838 అడుగులకు నీటినిల్వలు చేరినట్లయితే సంగమేశ్వరంలోకి గర్భాలయంలోకి నదీజలాలు ప్రవేశిస్తాయి. అదేవిధంగా 852 అడుగులకు సాలాకార మంటపం వరకు, 865అడుగులకు నీటినిల్వలు చేరినట్లయితే సంగమేశ్వరాలయ శిఖరా గ్రం పూర్తిగా నీటమునగనుంది. శ్రీశైల జలాశయం నీటిమట్టం ఆధారంగానే సంగమేశ్వరాలయం జలాధివాసం జరగటం పరిపాటిగా వస్తుంది.

Updated Date - Mar 19 , 2026 | 11:53 PM