Share News

ఇసుక టిప్పర్ల జోరు.. జనం బేజారు

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:27 AM

కోసిగి మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లపై ఇసుక టిప్పర్ల లారీల సంచారం రోజురోజుకూ మితిమీరిపోతుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై ఇసుక టిప్పర్లు అతివేగంగా దూసుకుపోతుండడంతో అటు వాహనదారులు, ఇటు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇసుక టిప్పర్ల జోరు.. జనం బేజారు
కోసిగి ప్రధాన రోడ్డుపై భారీగా వెళ్తున్న ఇసుక టిప్పర్లు

కోసిగిలో ప్రధాన రహదారిపై రేగుతున్న దుమ్ము ధూళి

ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులు, వాహనదారులు

కోసిగి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): కోసిగి మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లపై ఇసుక టిప్పర్ల లారీల సంచారం రోజురోజుకూ మితిమీరిపోతుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై ఇసుక టిప్పర్లు అతివేగంగా దూసుకుపోతుండడంతో అటు వాహనదారులు, ఇటు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకదాని వెంట మరొ భారీ వాహనాలతో కోసిగిలో ట్రాపిక్‌ స్థంభించిపోవడమే కాకుండా టిప్పర్ల వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక టిప్పర్ల రాకపోకల వల్ల రోడ్లపై భారీగా దుమ్మూ ధూళి వాహనాలు వెళ్తున్నప్పుడు రోడ్డు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీని వల్ల ద్విచక్రవాహనదారులు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి టిప్పర్ల వేగాన్ని కట్టడం చేయడంతో పాటు రోడ్డుపై దుమ్మూ లేయకుండా నీరు చల్లించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:27 AM