కామేశ్వరీదేవికి సారె
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:18 AM
ఆషాడమాసం పురస్కరిం చుకొని మహానంది కామేశ్వరీ దేవి అమ్మవా రికి ఉమ్మడి జిల్లాలోని బాలా జీ సేవ ట్రస్ట్ చెందిన వందలాది మంది మహిళా సభ్యులు చీరె, సారె అందజేసారు.
పాల్గొన్న వందలాది మంది సేవా సమితి సభ్యులు
మహానంది, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఆషాడమాసం పురస్కరిం చుకొని మహానంది కామేశ్వరీ దేవి అమ్మవా రికి ఉమ్మడి జిల్లాలోని బాలా జీ సేవ ట్రస్ట్ చెందిన వందలాది మంది మహిళా సభ్యులు చీరె, సారె అందజేసారు. ఆదివారం మహానందికి చేరుకొన్న వీరికి గరుడనందీ శ్వరు ని ఆలయం వద్ద ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ మధు, వేదపండితుడు రవిశంకర్ అవధాని స్వాగతం పలికారు. ఈవో జెండా ఊపి శోభా యాత్రను ప్రారంభించారు. క్షేత్ర పరిధిలోని మాడ వీఽధుల గుండా సంకీర్తనలు, కోలాటాలు, భజనలతో యాత్ర నిర్వహించారు.