బ్రహ్మచారిణీ నమోస్తుతే..
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:53 PM
శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రుల్లో రెండో రోజైన సోమవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ఉదయం ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, శ్రీచక్రార్చన, నవావరణార్చన, సహస్ర చండీపారాయణ సహిత శత చండీ మహా రుద్రయాగం, వేదపండితులు జరిపించారు.
మయూరవాహనంపై మల్లన్న విహారం
నేడు చంద్రఘంటాగా శ్రీశైల భ్రామరి
శ్రీశైలం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రుల్లో రెండో రోజైన సోమవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ఉదయం ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, శ్రీచక్రార్చన, నవావరణార్చన, సహస్ర చండీపారాయణ సహిత శత చండీ మహా రుద్రయాగం, వేదపండితులు జరిపించారు. సాయంత్ర విశేష పూజలు, జపాలు, పారాయణలు, హోమాలను నిర్వహించారు. భ్రమారాంబదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ప్రధానాలయ ప్రాకారంలో అమ్మవారి సింహ మండపం ఎదురుగా ప్రత్యేక వేదికపై శైలపుత్రి అమ్మవారికి పూజలు చేశారు. దసరా మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు కుమారీ పూజలు నిర్వహిస్తారు. అక్కమాహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక పుష్పాలంకరణ చేసిన వేదికపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను మయూర వాహనంపై ఆశీనుల చేసి షోడశోపచార పూజా క్రతువులను అర్చక వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. మయూర వాహనాధీశులైన ఆదిదంపతులు ఆలయ ప్రధాన వీధి నుంచి నంది ఆలయం మీదుగా క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాకారుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. చైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజ శర్మ, కాశినాథ్, ఆకుల శ్రీనివాసు లు, పీఆర్‌వో శ్రీనివాసరావు, ఏఈవో సాములు, హర్యానాయక్, ఉమేష్ పట్వారి, సీఎ్‌సవో శ్రీనివాసరావు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
మూడో రోజు..
దసరా మహోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం భ్రమరాంబదేవి చంద్రఘంటా అలంకారంలో దర్శనమివ్వగా స్వా మిఅమ్మవార్లకు రావణ వాహనంపై ప్ర త్యేక పూజలందుకుని భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.