Share News

శాయ్‌ హాస్టల్‌ కర్నూలులోనే

ABN , Publish Date - May 11 , 2026 | 11:58 PM

శాయ్‌ స్పోర్ట్స్‌ హాస్టల్‌ కర్నూలులోనే కొనసాగుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ స్పష్టం చేశారు.

శాయ్‌ హాస్టల్‌  కర్నూలులోనే
మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్‌, ఎంపీ, శాఫ్‌ చైర్మన్‌

స్పష్టం చేసిన మంత్రి టీజీ భరత్‌

కర్నూలు స్పోర్ట్స్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): శాయ్‌ స్పోర్ట్స్‌ హాస్టల్‌ కర్నూలులోనే కొనసాగుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ స్పష్టం చేశారు. సోమవారం ఎంపీ బస్తిపాటి నాగరాజు, శాప్‌ చైర్మన్‌ రవి నాయుడుతో కలిసి మంత్రి టీజీ భరత్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో ఉన్న శాయ్‌ స్పోర్ట్స్‌ హాస్టల్‌ ఇతర ప్రాంతాలకు తరలించే ఉద్దేశం లేదన్నారు. అవసరమైతే కర్నూలుకు ఏమైనా తీసుకురావడమే తప్ప ఇక్కడి నుంచి ఏదీ తరలించేది లేదన్నారు.

Updated Date - May 11 , 2026 | 11:58 PM