కాషాయ రంగులో పరిమళ ప్రసాదం
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:03 AM
శ్రీమఠంలో భక్తులకు విక్రయించే పరిమళ ప్రసాదం సోమవారం నుంచి యథాస్థితి కాషాయ రంగులోకి మార్చనున్నారు.
నేటి నుంచి టెంకాయ కొట్టడం ప్రారంభం
మంత్రాలయం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): శ్రీమఠంలో భక్తులకు విక్రయించే పరిమళ ప్రసాదం సోమవారం నుంచి యథాస్థితి కాషాయ రంగులోకి మార్చనున్నారు. చాతుర్మాస తొలి ప్రారంభంలో శాఖా వ్రతంను పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆదేశాల మేరకు కాషాయ రంగులో తయారుచేసే పరిమళ ప్రసాదాన్ని తెలు పు రంగులోకి మార్చారు. మధ్వపీఠం అనుసరించి సంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రకారం టెంకాయ కొట్టడం, నైవేద్యానికి, అలంకార భోజనానికి గడ్డలు, కూరగాయలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలైన యాలకులు, కేసరి, పచ్చకర్పూరం నెలరోజుల పాటు నిషేధం ఉన్న విషయం తెలసిందే. జూలై 25వ తేదీ నుంచి నెలరోజుల పాటు ఉన్న శాఖావ్రతం పూర్తికావడంతో ఆగస్టు 24వ తేదీ నుంచి కాషాయ రంగులో ప్రసాదం, టెం కాయ కొట్టడం ఉంటుందని మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, సురేష్ కోణాపూర్, వెంకటేష్ జోషి, శ్రీపతి ఆచార్ తెలిపారు.