కుసుమ సాగు చేయాలి
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:53 AM
భారతదేశంలో నూనెకు ఎంతో డిమాండ్ ఉందని, కుసుమ పంట సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవాలని భారతీయ నూనె గింజల పరిశోధన క్షేత్రం హైదరాబాదు శాస్త్రవేత్త డాక్టర్ ఆర్‌పీ ప్రసాద్ అన్నారు.
ఆదాయం పెంచుకోవాలి
పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్తలు
మద్దికెర, జనవరి 2(ఆంధ్రజ్యోతి): భారతదేశంలో నూనెకు ఎంతో డిమాండ్ ఉందని, కుసుమ పంట సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవాలని భారతీయ నూనె గింజల పరిశోధన క్షేత్రం హైదరాబాదు శాస్త్రవేత్త డాక్టర్ ఆర్‌పీ ప్రసాద్ అన్నారు. శుక్రవారం మండలంలోని బురుజుల, ఎం. అగ్రహారం, పెరవలి గ్రామాల్లో రైతులు సాగు చేసిన కుసుమ, వాము పంటలను శాస్త్రవేత్తలు ఆర్‌పీ లక్ష్మమ్మ, ఎన.సురే్‌ష లతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గంలో రెండు లక్షల హెక్టార్ల సాగు భూమి ఉందన్నారు. వర్షాధారం పంటలు సాగు చేస్తున్నారన్నారు. రైతులు కుసుమ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేయాలని సూచిం చారు. 10వేల కోట్లతో నూనెగింజల ప్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కేవీకే బనవాసి శాస్త్రవేత్త రాఘవేంద్ర, వ్యవసాయ శాఖ అధికారి రవి, ఏఈవో భోజరాజు, రైతులు నమ్మూరి మోహన, సూర్యనారాయణ, ఈశ్వరయ్య, సత్తిరెడ్డి, నాయుడప్ప, చంద్ర, నాగభూషణం ఉన్నారు.