రాఘవేంద్రుని సన్నిధిలో రష్యా దేశస్తురాలు పద్మ మంజరి
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:43 AM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం రష్యా దేశానికి చెందిన పద్మ మంజరి శనివారం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు.
మంత్రాలయం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం రష్యా దేశానికి చెందిన పద్మ మంజరి శనివారం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. శ్రీమఠం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు.పీఠాధిపతి రాఘవేంద్రస్వామి జీవితచరిత్రను అంగ్లంలో చెప్పారు. భారతీయ సంస్కృతి,సాంప్రదాయాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. రాఘవేంద్రస్వామి చరిత్ర పుస్తకాలను అందజేసి, కుటుంబసమేతంగా మరొక్కసారి రావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఏవో మాధవశెట్టి,ఐపీ నరసింహామూర్తి, సూపర్నిండెంట్ అనంతపురాణిక్, విజయేంద్రాచార్, వ్యాసరాజాచార్, రాఘవేంద్రపురాణిక్, నరసింహదేశాయ్, ద్వారపాలక అనంతస్వామి, తంబిస్వామి, వాజేంద్రాచార్, రాఘవేంద్రాచార్, పవనఆచార్, వరధేంద్రాచార్ పాల్గొన్నారు.