Share News

పెట్రోల్‌ కోసం పడిగాపులు

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:13 PM

కోసిగి మండల కేంద్రంలో పెట్రోల్‌ కష్టాలు తారస్థాయికి చేరాయి. ఆదోని రోడ్డులోని ఇండియన్‌ పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ లేక నోస్టాక్‌ బోర్డులు పెట్టారు.

పెట్రోల్‌ కోసం పడిగాపులు
నయారా పెట్రోల్‌ బంకులో పంపింగ్‌ మిషన్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో పెట్రోల్‌ కోసం ఎదురు చూస్తున్న వాహనదారులు

బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు

కోసిగి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కోసిగి మండల కేంద్రంలో పెట్రోల్‌ కష్టాలు తారస్థాయికి చేరాయి. ఆదోని రోడ్డులోని ఇండియన్‌ పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ లేక నోస్టాక్‌ బోర్డులు పెట్టారు. అలాగే ఎమ్మిగనూరు రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్‌బంకులో కూడా పెట్రోల్‌ అందుబాటులో లేదు. వాహనదారులు అసౌకర్యానికి గురవుతూ నయారా పెట్రోల్‌ బంకు వైపు పరుగులు తీస్తున్నారు. పెట్రోల్‌ పంపుల్లో సాంకేతిక లోపం రావడంతో పని చేయక పోవడంతో ఎండలో గంటల తరబడి వాహనదారులు అల్లాడిపోతున్నారు. పది రోజుల నుంచి కోసిగిలో పెట్రోల్‌ కష్టాలు కొనసాగుతున్నాయి. బంకులు మూసిన విషయం తెలుసుకున్న అక్రమ నిల్వదారులు, చిరు వ్యాపారులు అక్రమ దందాకు తెరలేపారు. పెట్రోల్‌, డీజిల్‌ను అక్రమంగా నిల్వ చేసి సమయం చూసి అడ్డగోలు ధరలకు విక్రయించారు. బ్లాక్‌లో లీటర్‌ పెట్రోల్‌ను రూ.150 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:13 PM