పడకేసిన పల్లె వైద్యం
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:09 AM
గ్రామాల్లో రోగులకు చిన్న జబ్బువచ్చినా చూసేవారు లేరు. వైద్యులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండటం లేదని సంతకం చేసి వెళ్లిపోతున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. అలాగే పలుచోట్ల సొంత భవనాలు పూర్తికాక, అద్దె భవనాల్లో నిర్వహిస్తుండటంతో రోగులు, వారి సహాయకులు ఇబ్బంది డుతున్నారు.
సంతకం పెట్టి వెళ్లిపోతున్న వైద్యులు, సిబ్బంది
పలుచోట్ల పూర్తికాని సొంత భవనాలు, వసతులు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు, సిబ్బంది
ఆళ్లగడ్డ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య ఉప కేంద్రాలను విలేజ్ హెల్త్ క్లినిక్ లుగా మార్చి, నూతతన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకొన్నారు. ఒక్కొక్క భవనానికి రూ 20.80 లక్షలు మంజూరు చేశారు. అయితే కొన్నిచోట్ల భవన నిర్మాణాలు పూర్తికాగా చాలా చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. మండలంలోని కొట కందుకూరు, మిట్టపల్లె గ్రామాల్లో నిర్మాణాలు పూరైనా భవ నాలను ప్రారంభించకపోవడంతో శిథిలావస్థకు చేరాయి.
పత్తాలేని వైద్యులు
ఆరోగ్య ఉపకేంద్రాల వైద్యులు తరచూ విధులకు డుమ్మఆ కొడుతున్నటు రోగులు, వారి సహాయకులు ఆరోపిస్తున్నారు. కోట కందుకూరు గ్రామంలో వైద్యులు అందుబాటులో ఉండటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఓబులంపల్లె గ్రామంలోని హెల్త్ సెంటర్‌లో కూడా వైద్యులు అందుబాటులో ఉండటంలేదని విమర్శలు ఉన్నాయి. ఇక్కడ స్టాప్‌నర్సు డాక్టర్ కుర్చీలో కూర్చుని విధులు నిర్వహిస్తూ ఉంటుంది. గ్రామీణ వైద్య కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవంతో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కేవలం సంతకం పెట్టి వెళ్లిపోతున్నట్లు, మూమెంట్ రిజిస్టర్‌లో కూడా సమాచారం రాయడం లేదని సొంత పనులపై వెళ్లి పోతున్నట్లు తెలుస్తోంది.
ఆళ్లగడ్డ తాలుకాలో పరిస్థితి
ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల, బత్తలూరు గ్రామాల్లో హెల్త్ సెంటర్లు ఆద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. ఆర్ కిష్ణాపురం, బాచేపల్లె గ్రామాల్లో పాత సచివాలయాల్లో కొనసాగుతున్నాయి. చాగలమర్రి మండలంలో మూడు వార్డులలో అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పెద్దవంగలి గ్రామంలో కొత్త భవనం నిర్మాణ దశలోనే ఉండడంతో పాత భవనంలో వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఉయ్యలవాడ మండలం హరివరం, పెద్దయమ్మనూరు, ఉయ్యలవాడలో కూడా అద్దె భబనాల్లోనే ఉన్నాయి. రుద్రవరం మండలం తిప్పారెడ్డిపల్లెలో, అద్దె భవనంలో వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. శిరివెళ్ల మండలంలో యర్రగుంట్లలో ఒకటో సచివాలయం పరిధిలో, శిరివెళ్లలో మూడు అద్దె భవనాల్లో ఉన్నాయి. గోవిందపల్లెలో కొత్త భవనం పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు.
పీహెచ్‌సీకి తాళం
పత్తాలేని వైద్యులు, సిబ్బంది
రుద్రవరం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నరసాపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి గురువారం రాత్రి 7గంటల కే తాళం వేశారు. ఇది 24 గంటలు వైద్యసేవలందించాల్సిన ఆసుపత్రి. ఈ ఆరోగ్య కేంద్రం నల్లమల అటవీ సమీప గ్రామాల మధ్య ఉంది. అత్యవసర వైద్యం నిమిత్తం వచ్చే రోగులు అవస్థలు పడే అవకాశం ఉంది. జిల్లా వైద్యాధికారులు స్పందించి, ఆసుపత్రి 24 గంటలు పనిచేసేలా చూడాలని రోగులు కోరుతున్నారు.