గ్రామీణాభివృద్ధే కూటమి లక్ష్యం
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:49 PM
గ్రామీణ ప్రాం తాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి
కర్నూలు రూరల్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాం తాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు రూరల్ మండలం పి.రుద్రవరం గ్రామంలో మంగళవారం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కోడుమూరు నియోజకవ ర్గంలో దాదాపు రూ.7.65 కోట్లతో గ్రామీణ రహదారులు, మౌలిక వసతులు వంటి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగా పి.రుద్రవరంలో నూత నంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లీనిక్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ డిప్యూటీ ఇం జనీర్ బండారి కర్రెన్న, వైద్య సిబ్బంది, యూనిట్ బూత, క్లస్టర్ ఇనచార్జిలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ: కర్నూలు రూరల్ మండలం ఉల్చాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణా నికి ఎమ్మెల్యే దస్తగిరి భూమిపూజ చేశారు. గత కొన్నేళ్ల నుంచి ఎస్సీ కాలనీలో మట్టి రోడ్డుతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడేవారు. ఈ నేపథ్యంలో గ్రామ టీడీపీ నాయకులు కలిసి విష్ణువర్దన రెడ్డి, ఎమ్మెల్యే దస్తగిరి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు పంచాయతీరాజ్‌శాఖ అధికా రులతో మాట్లాడి సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమై నిధులను మంజూరు చేయించారు. దీంతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వాటి తో పాటు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్, విలేజ్ హెల్త్ క్లినిక్, ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాబురెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్యామ్‌సుందర్ రెడ్డి, రాజారెడ్డి, అనంతరెడ్డి, క్రిష్ణారెడ్డి, బోయ బీసన్న, బోయ హనుమంతు, డీవీఎంసీ మద్దిలేటి, బుర్ర వెంకటేష్ పాల్గొన్నారు.