Share News

గ్రామీణ అభివృద్ధే కూటమి లక్ష్యం

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:01 AM

గ్రామీణ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

గ్రామీణ అభివృద్ధే కూటమి లక్ష్యం
భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఓర్వకల్లు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): గ్రామీణ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బుధవా రం మండలంలోని ఓర్వకల్లు నుంచి గుట్టపాడు మీదుగా ఎన.కొంత లపాడు వరకు 7.1 కిలోమీటర్ల మేర స్పెషల్‌ ఫండ్స్‌ రూ.2.80 కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆమె మాట్లాడుతూ గత వైసీపీ హయంలో గ్రామీణ రహదారులు గుంత లమయంగా మారి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామీణ రోడ్లను తీర్చిదిద్దిదన్నారు. పంచాయతీరాజ్‌ డీఈ సతీష్‌ కుమార్‌, ఏఈఈ రవి మోహన రెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్య క్షుడు గోవిందరెడ్డి, మండల కన్వీనర్‌ బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, గుట్టపాడు మాజీ సర్పంచ మోహన రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన నాగేశ్వరరెడ్డి, నాయకులు రాంభూపాల్‌ రెడ్డి, లక్ష్మీకాం తరెడ్డి, శ్రీరాములు, మౌళీశ్వరరెడ్డి, జనార్దన రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, చంద్రశేఖరప్ప, ఏసేపు, రామకోటే శ్వరరావు, వెంకటేశ్వర్లు పెద్ద గిడ్డయ్య, విజయుడు, సర్కార్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 01:01 AM