Share News

పల్లె కళలు పట్టణాలకు రావాలి

ABN , Publish Date - May 04 , 2026 | 12:10 AM

సంప్రదాయ గ్రామీణ కళలు పట్టణాలకు, నగరాలకు విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు, కళారత్న పత్తి ఓబులయ్య పిలు పునిచ్చారు

పల్లె కళలు పట్టణాలకు రావాలి
పత్తి ఓబులయ్యతో సత్కార గ్రహీతలు

టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య

కర్నూలు కల్చరల్‌, మే 3(ఆంధ్రజ్యోతి): సంప్రదాయ గ్రామీణ కళలు పట్టణాలకు, నగరాలకు విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు, కళారత్న పత్తి ఓబులయ్య పిలు పునిచ్చారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం పలు సాం స్కృతిక కార్యక్ర మాలు జరిగాయి. ముందుగా గోనెగండ్ల ప్రభుత్వ పాఠశాల హెచఎం, సీనియర్‌ కళాకారుడు వాల్మీకి రాముడు, నగర పాలక సంస్థ మేనేజర్‌ చిన్న రాముడు పదవీ విరమణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి ఓబులయ్య మాట్లా డుతూ వాల్మీకి రాముడు, చిన్నరాముడుల పని తీరు ఎంతో మంది ఉద్యోగులకు ఆదర్శప్రాయమని అన్నారు. ఈసందర్భంగా టీజీవీ కళాక్షేత్రం కళాకారులు, జెంటిల్‌మెన వాకర్స్‌ అసోసియేషన సభ్యులు వాల్మీకి రాముడు, చిన్నరాముడులను ఘనంగా సత్కరించారు. అనం తరం కళాక్షేత్రంలో చెక్కభజన కళాకారులు నిర్వహించిన చెక్కభజన, జడకోపు భజన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ తోట కృష్ణారెడ్డి, అధ్యాపకులు వై.రాజశేఖర్‌, నాగ్‌ అరుణ్‌, రిటైర్డు హెచఎం సీవీ రెడ్డి, సభ్యులు కల్లూరు శివయ్య, కేవీ రమణ, యాగంటీశ్వర్‌, సంగా ఆంజనేయులు, పి.రాజారత్నం, బీఎస్‌ ఎనఎల్‌ రమణ, మహ్మద్‌మియా, ఇనయతుల్లా పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2026 | 12:10 AM