Share News

రాళ్ల కోసం రూ.కోట్లు వృథా

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:05 AM

గత వైసీపీ ప్రభుత్వం సరిహద్దు రాళ్ల కోసం, రూ.కోట్లు వృథా చేసిందని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి ఆరోపించారు. గురువారం సహకార సంఘంలో సింగిల్‌ విండో చైర్మన్‌ చనుగొండ్ల శ్రీరాములు, సభ్యులచే సీఈవో వెంకటసుబ్బయ్య ప్రమాణ స్వీకారం చేయించారు.

రాళ్ల కోసం రూ.కోట్లు వృథా
ప్రమాణ స్వీకారం చేస్తున్న సొసైటీ అధ్యక్షుడు చనుగొండ్ల శ్రీరాములు

గత వైసీపీ ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్యే కోట్ల ధ్వజం

సీఎంపై బురద చల్లేందుకే వైసీపీ ధర్నా

డోన్‌ టౌన్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం సరిహద్దు రాళ్ల కోసం, రూ.కోట్లు వృథా చేసిందని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి ఆరోపించారు. గురువారం సహకార సంఘంలో సింగిల్‌ విండో చైర్మన్‌ చనుగొండ్ల శ్రీరాములు, సభ్యులచే సీఈవో వెంకటసుబ్బయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకవర్గం రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా కమిటి కృషి చేయాలని సూచించారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే పోతిరెడ్డిపాడు వద్ద వైసీపీ ధర్నా చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలు చీదరించుకున్నా, ఇంకా వారికి బుద్ధి రాలేదని మండిపడ్డారు. టీడీపీ ఇచ్చిన పట్టాదార్‌ పాసుప్తుకాల్లో ఎవరి ఫొటోలు లేవని, రాజముద్రతో ఇస్తున్నామన్నారు. హంద్రీనీవా కాలువతో రైతులకు సాగునీరు అంది, మేలు జరుగుతుందన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు. గత ప్రభుత్వంలో బుగ్గన డొల్ల బిల్డింగులు నిర్మించారని, వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. అధ్యక్షుడు మాట్లాడుతూ రైతుల కోసం పని చేస్తానని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినని ప్రతిజ్ఞ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వలసల రామకృష్ణ, కోట్రికే ఫణిరాజ్‌, లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ఓబులాపురం శేషిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కోట్రికే హరికిషణ్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు టీఈ రాఘవేంద్రగౌడు, శాలివాహన డైరెక్టర్‌ కుమ్మరి సుధాకర్‌, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడ్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే కోట్లను కలిసి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు బకాయిల చెల్లింపు, ఆర్థిక ప్రయోజనాలకు బడ్జెట్‌లో నిఽధలుఉ కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఇందుకు కోట్ల సానుకూలంగా స్పందించారు.

Updated Date - Feb 06 , 2026 | 12:07 AM