ఆర్టీసీకి రూ.3.5 కోట్ల ఆదాయం
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:08 AM
సంక్రాంతి పండుగ ఆర్టీసీకి ఆదాయాన్ని సమకూ ర్చింది. ప్రత్యేక బస్సు సర్వీసులను నడపడంతో సుమారు రూ.50 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం రజియా సుల్తానా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ద్వారా సుమారు రూ.50 లక్షలు
స్త్రీశక్తి పథకం కింద రూ.3 కోట్లు
నంద్యాల టౌన్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ ఆర్టీసీకి ఆదాయాన్ని సమకూ ర్చింది. ప్రత్యేక బస్సు సర్వీసులను నడపడంతో సుమారు రూ.50 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం రజియా సుల్తానా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేది నుంచి 19వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 150 ప్రత్యేక బస్సులు నడిపినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో 83 బస్సులు నడిపినట్లు తెలిపారు. ఎవరికి ఎటువంటి ఆ సౌకర్యం కలగకుండా నడిపామని చెప్పారు. ఈ పండుగకు ఎక్కువగా మహిళలు స్ర్తీ శక్తి పథకంతో ఎక్కువగా ప్రయాణించారు. జిల్లాలో సుమారుగా 7 లక్షల మంది ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించినట్లు పేర్కొన్నారు. ఉచిత ప్రయాణానికి సంబంధించి సంక్రాంతికి సుమారుగా రూ.3కోట్ల వరకు వచ్చినట్లు తెలిపారు.