ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచాలి: ఐద్వా
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:28 AM
ప్రయాణికులకు రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను వెంటనే పెంచాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల, కార్యదర్శి అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు రూరల్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రయాణికులకు రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను వెంటనే పెంచాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల, కార్యదర్శి అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కొత్తబస్టాండ్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. అనం తరం ప్రయాణికులతో సంతకాలు సేకరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింద న్నారు. రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చాలాచోట్ల మహిళలు వేచి ఉన్న ప్రాంతాల్లో బస్సులను ఆపకుండా వెళ్తున్నారని, కొన్ని బస్సుల్లో మహిళలపై అసభ్యంగా మాట్లాడుతున్న సిబ్బందిపై ఉన్నతాధికా రులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దసరా సెలవులు రానున్న నేపత్యంలో రద్దీ అధికంగా పెరిగే అవకాశం ఉందని ముం దుగానే అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఆర్టీసీ కర్నూలు రీజనల్ కార్యాలయంలో పర్సనల్ అధికారి రామకృష్ణ కు ఐద్వా మహిళలు వినతిపత్రం సమర్పించారు. నాయకులు అలివేలు, సుజాత, పద్మ, కుమారి, పర్వీన్ , సమీరా పాల్గొన్నారు.