రూ.21 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:32 AM
పట్టణంలోని పాతబస్టాండు వద్ద రూ.21కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టనున్న సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.
డోన్ టౌన్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాతబస్టాండు వద్ద రూ.21కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టనున్న సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. పట్టణాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్లేందుకు చేస్తున్న ఈ పనులు అభివృద్దిలో కీలకంగా నిలవనున్నాయన్నారు. రోడ్ల నిర్మాణం పూర్తయితే ప్రజలకు రాకపోకలకు మరింత సౌలభ్యంగా ఉంటుందన్నారు. రహదారులను అభివృద్ది చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలతో పాటు మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మాజీ రాష్ట్ర కార్యదర్శి కోట్రికే ఫణిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు సలీంధ్ర శ్రీనివాసులు యాదవ్, పట్టణ అధ్యక్షుడు టీఈ రాఘవేంద్రగౌడు, పీఏసీఎస్ చైర్మన్ చనుగొండ్ల శ్రీరాములు, ఆలేబాదు పరమేష్, పాతపేట సుధీష్, బీజేపీ ధను, బీజేపీ నాయకులు హేమసుందర్ రెడ్డి, దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ కే.నరే్‌షరెడ్డి, డీఈ రఘు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని అన్న క్యాంటీన్, కృష్ణానగర్, రోటరీ క్లబ్ వీది, పాతపేట, చిగురుమానుపేట తదితర కాలనీల్లో రూ.6 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే కోట్ల భూమి పూజ చేశారు.
సమన్వయంతో పనిచేయాలి
బేతంచెర్ల: స్థానిక సంస్ధల ఎన్నికల్లో విజయం సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే కోట్ల పిలుపునిచ్చారు. మంగళవారం జిఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. అనంతరం శ్రీనగర్ కాలనీలో పూజలు చేశారు.కన్వీనర్ బుగ్గన ప్రసన్న లక్ష్మి, పోలూరు రాఘవ రెడ్డి, తిరుమలేష్ చౌదరి, భీమేశ్వర్ రెడ్డి, బుగ్గన ప్రభాకర్ రెడ్డి, జాకీరుల్లా బేగర్, మేకల నాగరాజు, రూబెన్, జనసేన నాయకులు శ్రీకంటి మధు, చల్లా మద్దిలేటి స్వామి పాల్గొన్నారు.